సి‌ఎం జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఒకేసారి మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని, మళ్ళీ రెండున్నర ఏళ్లలో మార్పులు చేర్పులు చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే . ఇక జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అవుతున్నాయి. ఈ క్రమంలో మంత్రివర్గంలో మార్పులపై అనేక రకాల ప్రచారాలు నడుస్తున్నాయి. సగం క్యాబినెట్‌ని మారుస్తారని లేదు లేదు...80 శాతం అని, కాదు 90 శాతం క్యాబినెట్‌ని మారుస్తారని కథనాలు వచ్చాయి. కానీ సి‌ఎం జగన్ 100 శాతం క్యాబినెట్ మార్చేయనున్నారని, ఆ విషయం స్వయంగా తనతో చెప్పారని చెప్పి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పెద్ద బాంబ్ పేల్చారు.

ఇక 100 శాతం మార్పులు ఖాయమని తేలడంతో మంత్రి పదవులు ఆశించే వారి లిస్ట్ పెరిగిపోతుంది. ప్రతి జిల్లాలోనూ ఆశావాహులు పెరుగుతున్నారు. అయితే మంత్రి పదవులే కాదు...చీఫ్ విప్, విప్, స్పీకర్ పదవులు కూడా మారనున్నాయని ఏపీ రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే స్పీకర్, చీఫ్ విప్, విప్‌ల్లో కొందరు మంత్రి పదవులు ఆశించే లిస్ట్‌లో కూడా ఉన్నారు. ఇప్పటికే స్పీకర్ తమ్మినేని సీతారాం...మంత్రి పదవి ఆశిస్తున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. ఏ అంశంలోనైనా అనర్గళంగా మాట్లాడే తమ్మినేని, మంత్రిగా అయితేనే బెటర్ అని కొంత వాదన నడుస్తోంది. అలాగే తమ్మినేని కూడా మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తమ్మినేనికి మంత్రి పదవి ఇస్తే స్పీకర్‌గా ఎవరు ఉంటారనేది తెలియాల్సి ఉంది. స్పీకర్‌గా తమ్మినేని ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు.

మరి తమ్మినేనిని రీప్లేస్ చేసే నాయకుడు ఎవరనేది చూడాలి. శ్రీకాకుళంలో ఇప్పుడు మంత్రులుగా ఉన్న ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజులు నెక్స్ట్ సైడ్ అయిపోతారని తెలుస్తోంది. అంటే వీరి మంత్రి పదవులు పోవడం ఖాయం. అప్పుడు కృష్ణదాస్‌ని స్పీకర్ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. లేదంటే కృష్ణదాస్ సోదరుడు ధర్మాన ప్రసాదరావుకు స్పీకర్ పదవి ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఒకవేళ ప్రసాదరావుకు మంత్రి పదవి ఇస్తే, స్పీకర్ పదవి మరొకరికి ఇచ్చే ఛాన్స్ ఉంది. మరి చూడాలి నెక్స్ట్ పదవుల పంపకాలు ఎలా జరుగుతాయో?  

మరింత సమాచారం తెలుసుకోండి: