ప్రస్తుతం రాష్ట్రము తీవ్ర ఆర్ధిక కష్టాల్లో ఉంది. వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చాక ఎన్నో మంచి పథకాలను ప్రవేశ పెట్టారు. రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా సంక్షేమ పథకాలను ఆపింది లేదు. అయితే ఈ విద్యా సంవత్సరం మాత్రం స్కూల్ పిల్లకాకి ఇస్తున్న అమ్మఒడి పధకం అమలు ఆలస్యం అయ్యేలా ఉంది. మొన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో స్కూల్ హాజరు పట్టికలో పిల్లల హజరును ఆధారంగా చేసుకుని వచ్చే విద్యా సంవత్సరం ప్రదమార్థంలో అమ్మ ఒడి అందిస్తాను అని ప్రభుత్వం తెలిపింది. కానీ ఈ విద్యా సంవత్సరం ఏప్రిల్ లో ముగుస్తుంది. వాస్తవంగా ఆ లోపు అమ్మ ఒడి వస్తే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు తల్లితండ్రులు కట్టాల్సిన ఫీజులు చెల్లిస్తారు. కానీ కొత్తగా తెచ్చిన రూల్ వలన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అప్పటి వరకు  ఆగుతారా అన్నది సందేహమే.

దీనికి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులు పూర్తయ్యే  లోపు మాత్రమే చెల్లించాలని  ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇది తల్లితండ్రులపై భారం పడనుంది. అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే, గడిచిన రెండు సంవత్సరాల నుండి హాజరు నియమం ఉంది. కానీ ప్రభుత్వం దీనిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా చేస్తోంది  అంటూ విమర్శలు చేస్తున్నారు.  అయితే తల్లితండ్రులు మాత్రం జనవరి లోనే అమ్మ ఒడి డబ్బులు వేయాలని ఆశిస్తున్నారు.

కొందరు మాత్రం రాష్ట్రంలో ఖజానా ఖాళీ అవడం వలనే జగన్ ఆలస్యం అవుతుందని ముందుగానే హాజరుని కారణంగా చూపి ప్రిపేర్ చేస్తున్నాడని అంటున్నారు. మరి వారి కోరిక తీరుతుందా? ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పరిస్థితి ఏమిటి ? జగన్ తమ నిర్ణయాన్ని మార్చుకుంటారా? అన్న పలు ప్రశ్నలకు సమాధానం కావాలంటే జనవరి వరకు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: