మన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని ఒక దురదృష్టకర సంఘటన ఏదైనా ఉంది అంటే అది వుహాన్ నగరం నుండి ఊడిపడ్డ కరోనా మహమ్మారి వైరస్. దీని వలన మనము గత రెండు సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే మనము దాని నుండి కోలుకుంటున్నాము. అయితే ఇది పూర్తిగా మనల్ని వదిలి పెట్టి వెళ్లలేదని మనము ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా, జాగ్రత్తలు పాటించకున్నా మళ్ళీ కరోనా వచ్చే అవకాశం ఉంది. అయితే కరోనా బారిన పాడిన వారిలో చాలా మంది ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. అయితే ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం కరోనా నుండి కోలుకున్న వారిలో కొన్ని కొత్త మార్పులు గమనించినట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి.

అందులో ముఖ్యంగా ఇంతకు ముందు కన్నా ఇప్పుడు వారిలో వినికిడి సమస్య ఎక్కువ అయిందని తెలుస్తోంది. కొంత మంది అయితే అసలు పూర్తిగా వినికిడి లోపం కలిగి ఉన్నట్లుగా మాంచెస్టర్ యూనివర్సిటీ తెలిపింది. అయితే ఈ విషయం అంత ఈజీగా బయటపడలేదని తెలిసింది. మాంచెస్టర్ యూనివర్సిటీ నిపుణులు కోన్న బృందాలుగా విడిపోయి కరోనా వచ్చి పూర్తిగా నయం అయిన వారి వ్యక్తిగత వివరాలను సేకరించి వారితో ఫోన్ లో మాట్లాడి అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సందర్భంలో వినికిడి గురించి అడిగిన ప్రశ్నకు, వాటిలో 13.2 శాతం మంది మేము వినికిడిని కోల్పోయామని చెబుతున్నారు.

వీరికి భవిష్యత్తులో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందా అంటే వారి ఆరోగ్య పరిస్థితి పైన ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిని బట్టి వారు ఇంకా ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. సో... కరోనా సోకిన వారు జీవితాంతం సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం ఎంతో మంచిది. ఏవైనా కొత్త సమస్యలు తెలెత్తినట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.  

మరింత సమాచారం తెలుసుకోండి: