కొంద‌రు త‌మ సొంత లాభం కోసం మానవ హక్కులను చూస్తున్నార‌ని.. దీని వ‌ల్ల హక్కులతో పాటు ప్రజాస్వామ్యానికి హాని కలుగుతుంద ప్ర‌ధాని నరేంద్ర‌మోడీ అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) వ్యవస్థాపక వేడుకల్లో పాల్గొన్న ఆయ‌న ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఎన్‌హెచ్‌ఆర్‌సీ 28వ వ్యవస్థాపక దినోత్సవంలో మోడీ ప్ర‌సంగిస్తూ.. మానవ హక్కుల పేరుతో కొందరు వ్యక్తులు దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. త‌మ సొంత ప్ర‌యోజ‌నాల కోసం మాన‌వ హ‌క్కుల‌కు సెలెక్టివ్ నిర్వచనాలు ఇస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మోడీ.


   కొన్ని ఘటనల్లో మాత్రమే  మానవ హక్కుల ఉల్లంఘనలను చూసే కొందరు వ్యక్తులు ఇతర ఘటనల్లో మాత్రం హక్కుల ఉల్లంఘన చూడడం లేద‌ని ప్ర‌శ్నించారు. ఇలా రాజ‌కీయ‌ దృష్టితో చూస్తే మానవ హ‌క్కుల‌ ఉల్లంఘన జరుగుతుందని.. అలాగే ఇది ప్రజాస్వామ్యానికి హాని చేకూరుస్తుంద‌ని వ్యాఖ్యినించారు. ఒకే రకమైన సంఘటనల్లో కొన్నిటినీ ఎంచుకుని స్పందించ‌డం స‌రికాద‌ని అన్నారు.  ఈ కొందరి పట్ల ప్రజలు  జాగ్రత్త వహించాలని సూచించారు ప్ర‌ధాని మోడీ.

   
    అయితే, భార‌త దేశంలో నిజానికి కొన్ని సంఘ‌ట‌న‌ల్లో మాత్ర‌మే మాన‌వ‌హ‌క్కుల పై మాట్లాడే వారు ఉన్నారు. క‌శ్మీర్ లో ఉగ్ర‌వాదుల‌ను చంపితే వాళ్ల హ‌క్కుల గురించి మాట్లాడే వారు బాధితుల గురించి ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. బెంగాల్‌లో ఊచ‌కోత జ‌రిగినా ఆ వివ‌ష‌యంలో ఎవ‌రూ కూడా మాన‌వ హ‌క్కుల గురించి మాట్లాడ‌లేదు. దీంతో బీజేపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉండే సంఘ‌ట‌న‌లపై మాత్రం మాన‌వ హ‌క్కులు గుర్తుకు వ‌స్తాయా అన్న ప్ర‌శ్న మోడీ వ్యాఖ్య‌ల ద్వారా అర్థ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా మానవ హక్కుల సంరక్షణ కోసం బీజేపీ ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తోందో  ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వివ‌రించారు. అలాగే త‌మ ప్ర‌భుత్వం పేద‌ల కోసం, మ‌హిళ‌ల కోసం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నామో చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: