లఖింపుర్ ఘటనను ఖండించాల్సిందే : నిర్మల

లఖింపుర్ ఘటనను ఖచ్చితంగా ఖండించాల్సిదే. ఈ మాట అన్నది ఏ ప్రతిపక్ష నాయకులో కాదు. భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఉత్తర ప్రదేశ్ హింసాత్మక ఘటన పై ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఆమె ఈ  మాటను భారత్ అన లేదు, బోస్టన్ లో అన్నారు. ప్రస్తుతం అధికారిక పర్యటన నిమిత్తం అమె అమెరికాలో పర్యటిస్తున్నారు. హార్వర్డ్ స్కూల్ లో విద్యార్థులతో ముఖాముఖి సంభాషణల్లో విద్యార్థులు అడిగి ప్రశ్నకు ఆమె పై విధంగా సమాధానం ఇచ్చారు. 'భారత దేశంలో చాలా సమస్యలు చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉన్నాయి. అందరూ వాటిపై దృష్టి పెట్టాలి. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారం లో ఉంది. దీంతో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు ఈ ఘటనను రాద్ధాంతం చేస్తున్నాయి' అని ఆర్థిక మంత్రి సోదాహరణంగా వివరించారు. ప్రతి ఒక్కరూ లఖింపుర్ ఖెరి సంఘటను ఖండించాల్సిందే, అదే సమయంలో భారత్ లో దశాబ్దాలుగా తిష్టవేసుకుని కూర్చున్న సమస్యలపై కూడా దృష్టి పెట్టాలి అని ఆర్థిక మంత్రి తెలిపారు.'లఖింపుర్ ఘటనలో మమ్మల్ని మేము సంరక్షించు కోవటం లేదు. నేను కాని,  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాని, దేశం కోసం పని చేస్తున్నాం. దేశం గురుంచే మాట్లాడతాం. భారత్ లోని పేద ప్రజల బాగోగుల గురించి మాట్లాడుతాం. వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తాం' అని నిర్మలా సీతారామన్ తెలిపారు.

 రైతులు చేసున్న ఆందోళపై పలువులు ప్రశ్నలు వేశారు. దీనికి నిర్మలమ్మ తనదై రీతిలో సమాధానం చెప్పారు. దశాబ్ద కాలం క్రితమే పలు పార్లమెంటరీ సంఘాలు రైతుల సమస్యల పై చర్చించాయని  కేంద్ర  ఆర్థిక మంత్రి తెలిపారు. 2014 లో  బి.జె.పి ఏలుబడిలోని కేంద్ర ప్రభుత్వుం దీనిపై ఒక ముసాయిదాని తీసుకువచ్చిందని, దానిని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత  ప్రాంత ప్రభుత్వాలకు పంపిందని చెప్పారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నామన్నారు. ఈ బిల్లు పై లోక్ సభలో విస్త్రృత మైన చర్చ జరిగిందని  చెప్పారు. రాజ్యసభలోకి వచ్చిన తరువాతనే రచ్చ జరుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. దేశ వ్యాప్తంగా ఏ రైతూ ఈ బిల్లును వ్యతిరేకించడం లేదని,  పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలోని రైతులు మాత్రమే  రైతు చట్టాలను వ్యతిరేస్కున్నారని నిర్మలాసీతారామన్ బదులిచ్చారు. రైతులకు మద్ధతు ధర కల్పించేందుకు ప్రధాన మంత్రి కృత నిశ్చయంతో |ఉన్నారని కూడా ఆమె చెప్పారు. గత ఏడాది  కూడా రైతులకు మద్దతు ధర విషయంలో ఎక్కువ మొత్తమే చెల్లించారని గుర్తు చేశారు. తానేమీ మభ్యపెట్టే సమాధానాలు ఇవ్వడం లేదని, ఎవరైనా సరే  భారత్ కు వెళ్లి  క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు.

.


మరింత సమాచారం తెలుసుకోండి: