రాచకొండ కమిషనరేట్ నుంచి హైదరాబాద్ ప్రజలకు కీలక హెచ్చరికలు వెళ్ళాయి. కమీషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్స్ లోని కాపర్ వైర్స్ దొంగతనాలు చేస్తున్న ముఠా అరెస్ట్ చేసామని అన్నారు. రాచకొండ సీసీఎస్, కందకురు పోలీసులు, ఎల్బీనగర్ నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించామని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మొత్తం 25 లక్షల 6 వేల సొత్తు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 18 లక్షల నగదు, 160 కిలోల ట్రాన్స్ఫార్మర్స్ కాపర్ వైర్, నాలుగు బైక్స్, ఒక కార్ స్వాధీనం చేసుకున్నాం అని పేర్కొన్నారు.

నందు లాల్ రాజ్ బర్, అభిమాన్య రాజ్ బర్ ఇద్దరు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు అని సహదేవ్, రాహుల్ రాజ్ బర్ పరారీలో ఉన్నారు అని తెలిపారు. రాచకొండ 28 కేసులు నమోదు, సైబరాబాద్ లో 3,వికారాబాద్ లో 42,సంగారెడ్డి 4 కేసులు ఉన్నాయి అని పేర్కొన్నారు. నందులాల్ రాజ్ బర్, మొదటి నుండి దొంగ తనాలకు పాల్పడుతున్నారు అన్నారు. ఉత్తరప్రదేశ్ నుండి హైదరాబాద్ కు వచ్చి నేరాలకు పాల్పడుతున్న దుండగులు మీద ఫోకస్ చేసామని అన్నారు. ట్రాన్స్ఫార్మర్స్ లను టార్గెట్ చేస్తూ కాపర్ వైర్లు దొంగతనాలకు పాల్పడుతున్నారని వివరించారు.

379 ఐపిసి,పబ్లిక్ ప్రాపర్టీ సెక్షన్ 3 , 136 ఎలక్ట్రిక్ సిటీ సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేసామని అన్నారు. 196 ట్రాన్స్ఫార్మర్స్ డ్యామేజ్ చేసారు. ఇక దసరా పండుగకు ఊర్లకు వెళ్ళే వాళ్లకు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. దసరా పడగ కు రేళ్లేవారు తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఉరేళ్లేవారు చుట్టుపక్కల వారికి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని సూచించారు. ఇతర రాష్టాల కు చెందిన వారు దొంగతనాలకు పాల్పడుతారు అని అన్నారు. ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకుండా చూడాలి అని కోరారు. బంగారం , క్యాష్ ఇంట్లో పెట్టకుండా బ్యాంక్ లాకార్ల లో ఉంచుకోవాలి అని సూచించారు. ఎలాంటి అనుమానాలు వచ్చిన వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts