సినిమా అయినా మొదట జాలీగా స్టార్ట్ అయి నెమ్మదిగా బిగుసుకుంటుంది. ఎమోషన్స్, యాక్షన్ సీన్లు అన్నీ కూడా అపుడే స్టార్ట్ అవుతాయి. జీవితంలో కూడా పెళ్ళి తరువాత మొదట హానీమూన్ బాగానే ఉంటుంది, ఆ తరువాతనే సంసార బాధ్యతలు, సమస్యలు అన్నీ కూడా వెంటబడి వస్తాయి.


అలా చూసుకుంటే ఎక్కడైనా ఎవరికైనా హానీమూన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. జగన్ సర్కార్ విషయం తీసుకుంటే అది పూర్తి అయిపోయింది అనిపిస్తోంది. ఎందుకంటే ఇంటర్వల్ దాకా కధ వచ్చేసింది. దీని అర్ధం సగం పాలన సాగింది అని. ఇక ముందున్నది కూడా మొసళ్ళ పండుగ అనే అంటున్నారు. ఏపీలో చంద్రబాబు నవ్యాంధ్ర తొలి సీఎం గా తొంబై వేల కోట్ల అప్పులతో పాలన మొదలెట్టారు. ఆయన హయాంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితులు లేకపోయినా కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అలా ఆర్ధిక ఇబ్బందులతో టీడీపీ చేయాల్సిన అప్పులన్నీ చేసింది.


ఇక జగన్ అధికారంలోకి వచ్చాక ఆ వారసత్వమే కంటిన్యూ అయింది. జగన్ కూడా ఇప్పటిదాకా చాలా అప్పులు చేశారు. దానికి ఆర్ధిక పరిస్థితులు కారణం అయిత దాంతో పాటు కరోనా వంటి పెను ఉపద్రవం కూడా తోడు అయింది అని చెప్పుకోవాలి. దీంతో అనుకున్నవి ఏవీ చేయలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికల ముందు జగన్ తాను చెప్పిన మాట మేరకు ఉద్యోగ వర్గాలకు కూడా న్యాయం చేయలేకపోతున్నారు.


అయితే వారు చూస్తూ ఊరుకోరు కదా. అందుకే వారు అల్టిమేటం జారీ చేస్తున్నారు. మొత్తానికి వారితో ప్రభుత్వపరంగా చర్చలు మొదలయ్యాయి. తాము కూడా ప్రభుత్వానికి కొంత టైమ్ ఇస్తామని అంటున్నారు. అయితే ప్రతీ నెలా ఒకటవ తారీఖుకే జీతాలు పడాలని వారు కోరుకుంటున్నారు. ఇపుడున్న పరిస్థితుల నేపధ్యంలో అది కష్టమే అని చెప్పాలేమో. ఇక పీయార్సీ వంటివి కూడా కోరుతున్నా ఎప్పటికి అవుతాయో చూడాలి. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీ విజయం వెనక ఉన్నారు. వారిని దూరం చేసుకుంటే మాత్రం రాజకీయంగా ఇబ్బందులే.


మరో వైపు నవరత్నాల అమలునకు  కూడా నిధులు లేవు. అమ్మ ఒడి వంటి పధకాల విషయంలో కూడా ప్రభుత్వం తడబడుతోంది. ప్రతీ ఏటా సంక్రాంతి పండుగ వేళ ఇచ్చే ఈ సొమ్ము ఇపుడు వాయిదా పడిపోయింది. 2022 జూన్ నాటికి చెల్లిస్తామని విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. అంటే అది తల్లిదండ్రులకు షాక్ లాంటిదే. ఒక విధంగా ఇలా చెప్పడం అంటే చేతులెత్తేసినట్లే అని విపక్షాలు అంటున్నాయి. మరో వైపు చూస్తే చాలా హామీలు పెండింగులో ఉన్నాయి. కాలు కదపడానికి లేదు, ఖాలీ ఖజానా వెక్కిరిస్తోంది. మొత్తానికి చూస్తే మాత్రం అసలు సినిమా స్టార్ట్ అయింది అనిపిస్తోంది. ఇక్కడ నుంచి సాగే మిగతా సగం సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: