2019 ఎన్నికల్లో ఊహించని విధంగా బలమైన నేతలు కూడా ఓటమి పాలైన విషయం తెలిసిందే. జగన్ గాలిలో టి‌డి‌పిలో ఉన్న బడా నేతలు ఓటమి బాటపట్టారు. ఊహించని విధంగా టి‌డి‌పి కంచుకోటల్లో ఓడిపోయారు. అలా ఊహించని విధంగా ఓటమి పాలైన నేతల్లో ధూళిపాళ్ళ నరేంద్ర, ఆలపాటి రాజాలు ఉంటారని చెప్పొచ్చు. గుంటూరు జిల్లాలో ఈ ఇద్దరు కమ్మ నేతల ఓటమి ఎవరూ ఊహించలేదు.

ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తుందేమో అనుకున్నారు గానీ, నరేంద్ర-రాజాలు ఓడిపోతారని తెలుగు తమ్ముళ్ళు అనుకోలేదు. కానీ అనూహ్యంగా ఇద్దరు నేతలు ఓటమి పాలయ్యారు. పొన్నూరులో ధూళిపాళ్ళ, తెనాలిలో ఆలపాటిలు ఓడిపోయారు. అసలు పొన్నూరులో అప్పటివరకు టి‌డి‌పి ఓడిపోలేదు. 1983 నుంచి 2014 వరకు టి‌డి‌పి జెండా ఎగురుతూనే ఉంది. మొదట్లో నరేంద్ర తండ్రి...వీరయ్య మూడు సార్లు గెలిచారు. ఆ తర్వాత నుంచి నరేంద్ర వరుసగా అయిదుసార్లు గెలుస్తూ వచ్చారు.

2019 ఎన్నికల్లో కూడా విజయం ఖాయమని, డబుల్ హ్యాట్రిక్ కొట్టేస్తారని అనుకున్నారు. కానీ జగన్ వేవ్‌లో నరేంద్ర ఓడిపోయారు. ఇక్కడ వైసీపీ తరుపున ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారు రోశయ్య గెలిచారు. అయితే రెండున్నర ఏళ్లలో సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా రోశయ్యకు మంచి మార్కులు ఏమి పడటం లేదు. అటు ధూళిపాళ్ళ దూకుడుగా ఉంటున్నారు. అదేవిధంగా ఆయన్ని జైల్లో పెట్టడం కూడా వైసీపీకి మైనస్ అయింది. దీంతో పొన్నూరు ప్రజలు నరేంద్ర వైపు తిరిగేశారు.

అటు తెనాలిలో ఆలపాటి రాజా అనూహ్యంగా ఓడిపోయారు...రాజాపై వైసీపీ తరుపున అన్నాబత్తుని శివకుమార్ గెలిచారు. శివకుమార్ సైతం గొప్ప పనితీరు ఏమి కనబర్చడం లేదని తెలుస్తోంది. ఇటు రాజా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఇప్పటికే తెనాలిలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. పైగా రాజధాని అమరావతి అంశం రాజాకు ఫుల్ ప్లస్ కానుంది. మొత్తానికైతే నెక్స్ట్ ఎన్నికల్లో ధూళిపాళ్ళ నరేంద్ర, ఆలపాటి రాజాలకు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp