కుప్పం టార్గెట్‌గా అధికార వైసీపీ ఎన్ని రకాల రాజకీయాలు చేస్తుందో చెప్పాల్సిన పని లేదు. ఎలాగైనా చంద్రబాబుని ఓడించాలని చెప్పి గట్టిగా కష్టపడుతుంది. ఇప్పుడు అధికారంలో ఉండటంతో....ఆ అధికార బలాన్ని అంతా ఉపయోగించి కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి...కుప్పంలో చాలావరకు టి‌డి‌పిని వీక్ చేశారు. పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో టి‌డి‌పిని చిత్తుగా ఓడించారు. ఊహించని విధంగా ఇక్కడ వైసీపీ గెలిచింది.

ఇక ఈ ఫలితాల తర్వాత కుప్పంలో చంద్రబాబు గెలుపు కష్టమే అని ప్రచారం మొదలైంది. కొడాలి నాని లాంటి వారైతే...కుప్పంలో మళ్ళీ బాబు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ కూడా చేశారు. అంటే కుప్పం విషయంలో వైసీపీ కాన్ఫిడెన్స్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు. తాజాగా కుప్పం పర్యటన పెట్టుకున్నారు. కుప్పంలో పార్టీని మళ్ళీ గాడిలో పెట్టడానికి రెడీ అయ్యారు. కుప్పం ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటాననే కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే కుప్పంలో కూడా ఓడిపోతే చంద్రబాబు రాజకీయ జీవితానికి చెక్ పడినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో టి‌డి‌పి అడ్రెస్ గల్లంతు అవుతుంది. గత ఎన్నికల్లోనే జిల్లాలోని 14 సీట్లలో వైసీపీ 13 గెలుచుకుంది...కానీ ఒక కుప్పంలో మాత్రం చంద్రబాబు గెలిచారు. దాని వల్ల టి‌డి‌పి పరువు నిలబడింది.


కానీ కుప్పంలో కూడా బాబుకు చెక్ పెట్టేసి...చిత్తూరులో టి‌డి‌పిని తుడిచిపెట్టేయాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. కుప్పం స్థానాన్ని కూడా మిగల్చకూడదని భావిస్తుంది. అయితే వైసీపీ అనుకున్నట్లుగా అది సాధ్యపడకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పుడు ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి, అధికారం బలంతో విజయాలు సాధించింది గానీ, సాధారణ ఎన్నికలోచ్చేసరికి ఆ పరిస్తితి ఉండదనే చెప్పొచ్చు. కుప్పం నియోజకవర్గమే కాదు...ఇంకా చిత్తూరులో పలు నియోజకవర్గాల్లో టి‌డి‌పికి మంచి అవకాశాలు దక్కేలా కనిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp