మామూలుగా రాజకీయాలలో ప్రజల సేవ శ్రేయస్సు కన్నా కూడా నాయకుల సొంత ప్రయోజనాల కోసమే ఆరాటపడుతుంటారు. అందులో భాగంగానే టీడీపీ నుండి రాజ్యసభ సభ్యులుగా ఉన్న సీఎం రమేష్, సుజనా చౌదరి మరియు టి జి వెంకటేష్ లు గత రెండు సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయ్యారు. దీనికి ముఖ్య కారణం ఏపీలో టిడిపి ఘోర పరాజయాన్ని చవి చూడడమే. దీనితో తమ వ్యాపారాలను కాపాడుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లో చేరిపోయారు. కట్ చేస్తే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు పొమ్మనలేక పొగ బెట్టినట్టున్నాయి. వీరు బిజెపిలోకి రావడం కొంత మందికి ఇష్టం లేకుండా ఉండేది. దీనితో కొన్నిసార్లు వీరు చేసిన వ్యాఖ్యలకు జి వి ఎల్ నరసింహారావు లాంటి నాయకులు కౌంటర్ వేసే వారు.

తమ స్వార్థం కోసమే  పార్టీలోకి వచ్చారని చులకన భావం ఏర్పడింది. గత కొద్ది రోజులుగా మీరు గమనిస్తే బీజేపీకి సంబంధించిన ఏ కార్యక్రమాలకు వీరి ముగ్గురికి ఆహ్వానాలు అందడం లేదు. పైగా ఈ విషయం తెలిసిన ఈ ముగ్గురు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఏపీ బీజేపీ కో ఇంఛార్జి గా ఉన్న సునీల్ దేవదర్ కూడా వీరిపై పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు.  బీజేపీ కొంత మందికి పార్కింగ్ లా మారిపోయిందని వారిని ఉద్దేశించి అనడంతో, ఆ ముగ్గురూ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఢిల్లీ పెద్దల దగ్గర ఈ ముగ్గురి పంచాయితీ ఉంది.

వారు ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపై పార్టీలో వీరి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే దేవాధర్ వ్యాఖ్యలను సమర్థించే లాగా ఉన్నారని తెలుస్తోంది. మరి ఏమి జరగనుందో  తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: