కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి రోజు రోజుకూ మారిపోతోంది. అసలే ప్రతిపక్షంలో ఉన్న హస్తం పార్టీకి... వరుస సమస్యలు ఊపిరి ఆడనివ్వటం లేదు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప హాయాంలో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌పై కేసులు నమోదు చేసి... జైలుకు కూడా పంపారు. నాటి నుంచి పార్టీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, శివకుమార్ అంటూ రెండు గ్రూపులుగా విడిపోయింది కర్ణాటక కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియో కన్నడ కాంగ్రెస్ నేతలను కలవరపెడుతోంది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా కో ఆర్డినేటర్ ఎంఏ సలీం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోంది కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌పై సలీం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోలో మాజీ ఎంపీ వీఎస్ ఉగ్రప్ప కూడా ఉన్నారు. ఈ వీడియో కారణంగా కేపీసీసీ మీడియా కో ఆర్డినేటర్ సలీంపై బహిష్కరణ వేటు వేసింది కాంగ్రెస్ పార్టీ. డీకే శివకుమార్, ఆయన సహచరులు భారీగా లంచాలు స్వీకరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంఏ సలీం.

గతంలో ప్రతి పనికి ఓ రేటు ఉండేదని వ్యాఖ్యానించిన సలీం... దానిని ఇప్పుటు రెట్టింపు చేశారని ఆరోపించారు. గతంలో 6 నుంచి 8 శాతం ఉండేదన్న సలీం... ఇప్పుడు మాత్రం 10 నుంచి 12 శాతం వరకు వసూలు చేస్తున్నారని సలీం ఆరోపించారు. ఈ వ్యవహారం అంతా కూడా డీకే శివకుమార్ స్వయంగా సర్థుబాటు చేశారన్నారు. డీకే సహచరుడు ముల్లుండ్ ఇప్పటి వరకు దాదాపు వంద కోట్ల రూపాయల వరకు సంపాదించుకున్నట్లు ఎంఏ సలీం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వీడియోపై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం దృష్టి పెట్టింది. సలీంను ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే మాజీ ఎంపీ ఉగ్రప్పకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయితే ఉగ్రప్ప మాత్రం... శివకుమార్‌పై వచ్చిన ఆరోపణలను తప్పుబట్టారు. బీజేపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: