ఔరా...! ఇది నిజమేనా ?
కేవలం రూ. 25 వేలు మాత్రం  వచ్చాయంట !
ఎన్నికల సంఘం  భారత దేశంలో ఒక స్వతంత్య్ర ప్రతి పత్తి గల సంస్థ. వాటికున్న విస్తృత అధికారాలు ఏ ఇతర ప్రభుత్వ సంస్థలకూ లేవు.  ఆ శాఖ నుంచి వచ్చిన ఉత్తర్వులు శిలా శాసనం. దేశంలో ప్రతి ఒక్కరూ వీటిని ఆమోదించి తీరాలు. రాజ్యాంగం ఎన్నికల సంఘానికి కల్పించిన అధికారం ఇది.   దేశంలో ఏ ఎన్నికనయినా సరే ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది.  పంచాయితీ వార్డు  సభ్యుడి ఎన్నిక మొదలు కుని  భారత్ లోని అత్యున్నత పదవి రాష్ట్రపతి ఎన్నిక కూడా ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది. అది దాని విధి, దాని పరిధి.
ఎన్నికల సంఘం మార్గ దర్శకాలు ఎప్పటి కప్పుడు మారుతూ ఉంటాయి. నియమ నిబంధనలను అసరించి  ఆయా రాజకీయ పార్టీలు నడుచుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షం ఆ పార్టీ గుర్తుంపు రద్దు అయ్యే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలకు ఎన్నికలలో గుర్తులు కేటాయించేది ఎన్నికల సంఘమే. ఏ రాజకీయపార్టీ అయినా ముందుగా ఎన్నికల సంఘంలో తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పార్టీకి ప్రజలలో ఉన్న పలుకుబడిని బట్టి సదరు పార్టీ ఏ కోవ లోకి వస్తుందో నిర్ణయిస్తుంది ఎన్నికల సంఘం.  దీనిని బట్టి సదురు  రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీ జాబితాలోకి వస్తుందా ? లేక జాతీయ పార్టీ జాబితాలోకి వస్తుందా అని తెలుస్తుంది.ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ పూర్తి వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలి. ప్రతి రాజకీయ పార్టీ కూడా తమ ఆదాయ, వ్యయాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి తెలియపరచాలి.
తాజాగా ఎన్నికల సంఘం చేసిన ప్రకటన పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయవేత్తలు మాత్రం
ఇది తెలిసిన విషమే నని తమలో తాము ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.  ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్నవై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల తమ ఆదాయ. వ్యయాలను ఎన్నికల సంఘానికి సమర్పించింది. వాటిని ఎన్నికల సంఘం తాజాగా బహిర్గతం చేసింది. ఇందులో విస్తుపోయే విషయం వెలుగు చూసింది.
వై.ఎస్.ఆర్ సి.పి కి  చందాల రూపంలో వచ్చింది కేవలం  ఇరవై అయిదు వేల రూపాయలు మాత్రమేనని సాక్షాత్తు ఎన్నికల సంఘం ప్రకటించింది. 2020-21  ఫైనాన్సియల్ ఇయర్ లో తమకు వచ్చిన ఆదాయ, వ్యయాల పట్టికను వై.ఎస్.ఆర్ .సి.పి  తమకు అందజేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో  96.25 కోట్ల రూపాయలు ఆ పార్టీ ఖాతాలో చేరాయి.  రాజకీయ పార్టీలు తమ బ్యాలెన్స్ షీట్ లను  అక్టోబర్ 30 వ తేదీలోగా సమర్పించాలని నిబంధన ఉంది. తెలుగా రాష్ట్రాలలో ఒక్క వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే తన వివరాలను అందించింది.







మరింత సమాచారం తెలుసుకోండి: