తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ని స్థాపించిన విష‌యం తెలిసిందే. అయితే తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టు కోవ‌డానికి వైఎస్ ష‌ర్మిల చాలా క‌ష్ట ప‌డుతున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను న‌మ్మకాన్ని సంపాధించు కోవ‌డానికి వైస్ ష‌ర్మిల చేస్తున్న ప్ర‌యోగాల‌న్నీ కూడా విఫ‌లం అవుతున్నాయి. పార్టీ ని తెలంగాణ లో బలోపేతం చేయాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఇప్ప‌టికే తెలంగాణ లో కాస్త ప్ర‌జా ఆక‌ర్ష‌ణ ఉన్న లీడ‌ర్ల‌ను త‌న పార్టీ లోకి ఆహ్వ‌నించింది. అందులో భాగంగానే ప్ర‌జా గాయ‌కుడు తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుడు ఏపూరి సోమ‌న్న కూడా వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ లో చేర్చు కుంది. అలాగే రాష్ట్ర ప్ర‌జ‌ల కు ప‌రిచయం ఉన్న నేత‌ల‌ను త‌న పార్టీ లో చేర్చడానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంది.



అయితే తెలంగాణ లో వైఎస్ ష‌ర్మిల నూత‌నంగా ప్రారంభించిన పార్టీ ని ఎవ‌రు న‌మ్మ‌డం లేద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టి కే ఈ పార్టీ లో కీల‌కం గా ఉన్న ఇందిర శోభ‌న అనే నేత వైఎస్ ఆర్ టీ పీ కి రాజీనామా చేశారు. దీంతో అప్ప‌టి కాలంలో ఈ రాజీనామా తో తెలంగాణ లో వైస్ ష‌ర్మిల పార్టీ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. కానీ ష‌ర్మిల ప్ర‌య‌త్నాల వ‌ల్ల ఇంకా తెలంగాణపార్టీ మ‌నుగ‌డ సాగిస్తుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో వైస్ ష‌ర్మిల తీసుకున్న ఒక నిర్ణ‌యం అంద‌రినీ కూడా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ  పార్టీ సిట్ల‌న్నీ కూడా నిరుద్యోగుల‌కు కేటాయిస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో తెలంగాణ లో వైఎస్ఆర్‌టీపీ కి ఎమ్మెల్యే అభ్య‌ర్థు లే దొర‌క‌డం లేద‌ని ఇత‌ర పార్టీ ల నాయ‌కులు అంటున్నారు. అందుకే నిరుద్యోగుల‌కు సిట్ల‌ని చెప్పి వారి ఓట్లు దండు కోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: