తెలంగాణ రాజ‌కీయాల్లోకి వైఎస్ ష‌ర్మిల అడుగు పెట్టిన నాటి నుంచి ప్ర‌ధానంగా నిరుద్య‌గం పై మాట్లాడుతూ వ‌స్తున్నారు. ఆ త‌రువాత వైఎస్ఆర్‌టీపీ పేరుతో నూత‌న పార్టీని స్థాపించారు. తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తాన‌ని, రాజ‌న్న కూతురుగా త‌న‌ను ఆశీర్వ‌దించాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన ష‌ర్మిల ప్ర‌తి స‌మ‌స్య‌పై వేలెత్తి మ‌రి చూపిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా నిరుద్య‌గ స‌మ‌స్య‌పై తెలంగాణ ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తూ వ‌స్తున్నారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల పేరు పైన‌న తెచ్చుకున్ స్వ‌రాష్ట్రంలో నేడు యువ‌త నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ త‌న ప్ర‌ధాన ఎజెండా నిరుద్యోగం అని చెప్ప‌క‌నే చెబుతున్నారు వైఎస్ ష‌ర్మిల‌.


   ఈ సంద‌ర్భంగా నిరుద్య‌గుల వెంట ఉంటూ నిరుద్యోగ నిరాహ‌ర దీక్ష మొద‌లు పెట్టారు. సీఎం కేసీఆర్ కుటంబంలో న‌లుగురికి ప‌ద‌వులుంటే స‌రిపోతుందా అని నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు అవ‌స‌రం లేదా అంటూ ప్ర‌శ్నించారు. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఈ క్ర‌మంలో వైఎస్ ష‌ర్మిల పార్టీ పెట్టి నిరుద్యోగుల త‌ర‌ఫ‌న ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారు. అలాగే నిరుద్యోగుల‌కు సీట్లు ఇస్తామ‌ని చెప్పుకొస్తున్నారు.


   అయితే, నిరుద్యోగులు ఒక పార్టీకి స‌పోర్ట్ చేయ‌డం చాలా క‌ష్టం కొంద‌రు స‌పోర్ట్ చేసినా మిగ‌తా వాళ్లు ఆయా పార్టీల‌కు చెందిన వారుగా ఉంటారు.  ఆయా పార్టీల్లోని విద్యార్థి నాయ‌కులు వాళ్ల‌ను త‌మ వెంట ఉంచుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. దీంతో ఇత‌ర పార్టీల‌కు మ‌ద్ధ‌తు ఇచ్చే ప‌రిస్తితి ఉండ‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. నిరుద్యోగుల‌కు మ‌ద్ధ‌తుగా చేప‌ట్టిన నిరాహార దీక్ష‌లో ప్ర‌తి మంగ‌ళ‌వారం వైఎస్ ష‌ర్మిల పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో నిరుద్యోగుల నుంచి బాగానే స్పంద‌న వ‌స్తున్నా అవి ఓట్లుగా మారేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని రాజ‌కీయ వర్గాలు భావిస్తున్నాయి. మ‌రి వైఎస్ ష‌ర్మిల‌కు ఏ మేర‌కు నిరుద్యోగులు బాస‌ట‌గా నిలుస్తారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: