పశ్చిమ గోదావరి జిల్లా అంటే....తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ టి‌డి‌పి ఎప్పుడు మెరుగైన ఫలితాలే సాధిస్తూ వస్తుంది. కానీ గత ఎన్నికల్లోనే సీన్ రివర్స్ అయింది. జిల్లాలో ఉన్న 15 సీట్లలో వైసీపీ 13 గెలుచుకుంటే, టి‌డి‌పి 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. పైగా వైసీపీ అధికారంలోకి వచ్చాక, వెస్ట్‌లో టి‌డి‌పి కాస్త గడ్డు పరిస్తితులు ఎదురుకుంటుంది. అయితే ఇప్పుడుప్పుడే కొన్ని నియోజకవర్గాల్లో పికప్ అవుతుంది.

కానీ కొన్నిచోట్ల మాత్రం టి‌డి‌పి పరిస్తితి దారుణంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అందులో పోలవరం నియోజకవర్గంలో టి‌డి‌పి పరిస్తితి చెప్పాల్సిన పని లేదు. మొదట నుంచి పోలవరం టి‌డి‌పికి అంత అనుకూలమైన నియోజకవర్గం కాదు. మొదట్లో కాస్త మంచి విజయాలు సాధించింది గానీ....2004 నుంచి టి‌డి‌పి కాస్త నిలబడలేకపోయింది. 2004, 2009, 2012 (ఉపఎన్నిక) ఎన్నికల్లో టి‌డి‌పి ఓడిపోయింది. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం విజయం సాధించింది.

కానీ టి‌డి‌పి తరుపున గెలిచిన ముడియం శ్రీనివాసరావు మంచి పనితీరు కనబర్చలేదు. ఫలితంగా పోలవరంలో టి‌డి‌పి పరిస్తితి మళ్ళీ మొదటకొచ్చింది. పైగా గత ఎన్నికల్లో చంద్రబాబు...ముడియంని పక్కనబెట్టి బొరగం శ్రీనివాసరావుని నిలబెట్టింది. అయితే జగన్ గాలిలో బొరగం దాదాపు 42 వేల ఓట్ల భారీ మెజారిటీ తేడాతో తెల్లం బాలరాజు చేతిలో ఓడిపోయారు. అక్కడ నుంచి టి‌డి‌పికి ప్లస్ ఏ మాత్రం అవ్వడం లేదు.

ఎందుకంటే ఎమ్మెల్యేపై నెగిటివ్ ఏమి రావడం లేదు....రెండున్నర ఏళ్లలో బాలరాజు పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. పైగా ప్రజలకు అందుబాటులో ఉండటంలో బాలరాజు ముందే ఉంటారు. అటు సంక్షేమ పథకాలు బాలరాజుకు బాగా ప్లస్ అవుతున్నాయి. ఇవన్నీ చూసుకుంటే పోలవరంలో బాలరాజు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని అర్ధమవుతుంది...పైగా ఆయనకు త్వరలో మంత్రి పదవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అంటే బాలరాజు ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది....దీంతో పోలవరంలో టి‌డి‌పి గెలుపుని మర్చిపోవచ్చని చెప్పొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP