తెలంగాణ లో రాజ‌కీయం ఎప్పుడు ఎలా ట‌ర్న్ తీసుకుంటుందో ?  కూడా అర్ధం  కావ‌డం లేదు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌లు ముగిసిన‌ప్ప‌టి నుంచి కాంగ్రెస్ పార్టీ గ్రాప్ క్ర‌మ‌క్ర‌మంగా ప‌డిపోతూ వ‌చ్చింది. అస‌లు కాంగ్రెస్ కు తెలంగాణ‌లో భ‌విష్య‌త్తు ఉంటుందా ? అని చాలా మంది ఆ పార్టీ నేత‌లే ల‌క్ష సందేహాలు వ్య‌క్తం చేశారు. చివ‌ర‌కు దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌లో మాజీ మంత్రి చెర‌కు ముత్యం రెడ్డి త‌న‌యుడు ను చివ‌ర్లో పార్టీలోకి తీసుకుని పోటీ లో పెట్టారు. అయితే ఆ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ కు డిపాజిట్లు ద‌క్క‌లేదు స‌రిక‌దా ? ఏకంగా మూడో స్థానంతో స‌రిపెట్టుకుంది.

పైగా దుబ్బాక‌లో బీజేపీ విజ‌యం సాధించింది. అంత‌కు ముందు అప్పుడు టీ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఉన్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తాను ఎంపీ గా గెల‌వ‌డంతో హుజూర్ న‌గ‌ర్ అసెంబ్లీ స్థానంలో త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో అక్క‌డ ఉప ఎన్నిక వ‌చ్చింది. అక్క‌డ ఉప ఎన్నిక‌ల్లో త‌న భార్య ప‌ద్మావ‌తిని నిల‌బెట్టినా కూడా కాంగ్రెస్ ఏకంగా 40 వేల పై చిలుకు భారీ తేడాతో ఓడిపోయింది. ఇక నాగార్జునా సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లోనూ టీఆర్ ఎస్ ముందు , కాంగ్రెస్ కురు వృద్ధుడు జానారెడ్డిని నిల‌బెడితే ఆయ‌న కూడా చిత్తు చిత్తుగా ఓడిపోయారు.

ఇక రేవంత్ రెడ్డి ఎప్పుడు అయితే టీ కాంగ్రెస్ అధ్య‌క్షుడు అయ్యారో అప్ప‌టి నుంచి ఒక్క‌సారిగా ట‌ర్న్ తీసుకుంది. తెలంగాణ లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. రేవంత్ రాష్ట్రం అంత‌టా విస్తృతం గా ప‌ర్య‌టిస్తున్నారు. దీంతో నిన్న‌టి వ‌ర‌కు బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ మ‌ధ్య ఉన్న పోటీ కాస్తా ఇప్పుడు టీఆర్ ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ అన్న‌ట్టుగా మారిపోయింది. అయితే రేవంత్ ఇంత దూకుడుగా ముందుకు వెళుతున్నా ఆయ‌న‌కు సొంత పార్టీలో సీనియ‌ర్లు అయిన ఎంపీలు ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నార‌ట‌.

వీరిద్ద‌రు కనీసం రేవంత్ తో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ ను కూడా రేవంత్ కు దూరంగా ఉంచేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిద్ద‌రు రేవంత్‌ను టార్గెట్ చేసుకుని క‌లిసిపోయి రాజ‌కీయం చేస్తున్నార‌ట‌. మ‌రి రేవంత్ వీరిని ఎలా ఎదుర్కొంటారో ? చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: