తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తాన‌ని  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి కూతురు వైఎస్ ష‌ర్మిల ఆమె త‌ల్లి విజ‌య‌మ్మ‌తో క‌లిసి తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు.  పార్టీ ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మాన్ని హైద‌రాబాద్ లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆది నుంచి కేసీఆర్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తూ వ‌స్తున్నారు.  ఈ క్ర‌మంలో నిరుద్యోగ విష‌యంలో ఎక్కువ ఫోక‌స్ పెట్టారు ష‌ర్మిల‌. 


నిరుద్యోగ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం ప్ర‌తి మంగ‌ళ‌వారం నిరాహార దీక్ష చేప‌ట్టారు. అలాగే, తెలంగాణ‌లో పార్టీని ముందుకు తీసుకుపోయేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్ర‌భుత్వంపై నిరుద్యోగ బాణం ఎక్కుపెట్టారు వైఎస్ ష‌ర్మిల‌. విద్యార్థుల‌ను, నిరుద్యోగుల‌ను కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డం లేద‌న తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. విద్యార్థులు బాగా చ‌దువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని యూనివ‌ర్సీటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌డం లేద‌ని మండి ప‌డ్డారు. 


అలాగే కేసీఆర్ మీద వ‌రుస ట్వీట్లు చేస్తూ విమ‌ర్శ‌లు చేస్తున్న విషయం విధిత‌మే. అలాగే, కేసీఆర్ కుటుంబం బాగుంటే స‌రిపోతుందా.. తెలంగాణ‌లోని అన్ని కుటుంబాలు బాగు ప‌డొద్దా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. విశ్వ విద్యాల‌యాల భూముల‌పై టీఆర్ఎస్ నేత‌ల క‌న్ను ప‌డిందంటూ ఆరోపిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో నిరుద్యోగుల చేత నామినేష‌న్లు వేయించి అధికార టీఆర్ఎస్ పార్టీకి  గుణ‌పాఠం చెబుదామ‌నుకున్న ష‌ర్మిల ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. స‌రైన రీతిలో నామినేష‌న్ ప‌త్రాలు లేనందున్న అధికారులు తిర‌స్క‌రించారు.


  అయితే, త‌మ పార్టీ నుంచి హుజురాబాద్ బ‌రిలో దిగ‌క‌పోవ‌డం వ‌ల్ల ష‌ర్మిల‌కు మైన‌స్ గా మారుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అలాగే, వైఎస్ ష‌ర్మిల తమ పార్టీ త‌ర‌ఫున నిరుద్యుగుల‌కు సీట్లు ఇస్త‌మనే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీని వ‌ల్ల నిరుద్యోగ యువ‌తి యువ‌కుల‌ను అలాగే విద్యార్థుల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌డానికి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ విష‌యంలో నిరుద్యోగులు ష‌ర్మిల‌కు ఏ మేర‌కు వెన్న‌ద‌న్నుగా నిలుస్తారో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: