ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న ఏకైక సమస్య... బొగ్గు. తీవ్ర బొగ్గు కొరత కారణంగా దేశంలోని అన్ని ధర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా విద్యుత్ ఉత్పత్తి దాదాపు సగానికి పైగా తగ్గించేశాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే విద్యుత్ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 5 ఏళ్ల తర్వాత విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఇక ఢిల్లీ ప్రభుత్వం అయితే ప్రజలంతా సహకరించాలని ఏకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి విజ్ఞప్తి చేశారు. ఇక తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అయితే... తెలంగాణకు ఎలాంటి బొగ్గు కొరత లేదని ప్రకటించారు. సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయాలని కేంద్రం లేఖ రాసినట్లుగా స్వయంగా మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దేశంలో బొగ్గు కొరతపై స్పందించారు కూడా. ఇదంతా విపక్షాల డ్రామా అని కొట్టిపారేశారు. ఎలాంటి విద్యుత్ సంక్షోభం లేదన్నారు నిర్మలా సీతారామన్.

ఇక ఆంధ్రప్రదేశం ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వయంగా లేఖ కూడా రాశారు. త్వరగా బొగ్గు సమస్య తీర్చాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇక ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే... ఒక అడుగు ముందుకు వేశారు. విద్యుత్ సంక్షోభం దృష్ట్యా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఏసీల వినియోగం తగ్గించాలని... ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కూడా విజ్ఞప్తి చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇంత జరుగుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి బాలనేని శ్రీనివాసరెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఈ సమస్యపై కనీసం స్పందించలేదు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియటం లేదు. బొగ్గు కొరతపై తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేయడం లేదంటూ తాజాగా ఓ ట్విట్ మాత్రం... పోస్ట్ చేశారు. అంతే తప్ప... కనీసం ఆ శాఖ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించినట్లు కనిపించలేదు. దీనిపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు కూడా చేశారు. కాసేపు నీ పేకాట శిబిరాల నుంచి బయటకు రా... అంటూ టీడీపీ నేత పట్టాభి ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అయినా సరే విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జాడ మాత్రం తెలియటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: