ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు ఎంతగా వేడెక్కుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 2019 ఎన్నిక‌ల కు ముందు ఏపీ రాజ‌కీయం నాడు అధికారం లో ఉన్న టీడీపీ, విప‌క్ష వైసీపీ తో పాటు జ‌న‌సేన , అప్ప‌టి వ‌ర‌కు టీడీపీతో మిత్ర‌ప‌క్షంగా ఉండి.. విడిపోయిన బీజేపీ మ‌ధ్య హాట్ హాట్ గా సాగింది. నాడు ఆ ఎన్నిక‌ల్లో అన్ని పార్టీల నేత‌లు ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్రంగా విమ‌ర్శ‌లు చేసుకున్నారు.

గ‌త ఎన్నిక‌ల కు ముందు టీడీపీని ఢీ కొట్టేందుకు వైసీపీ ప్ర‌ధానంగా క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని ఎలా ?  టార్గెట్ గా చేసుకుందో చూశాం. ఇక గ‌త ఎన్నిక‌ల్లో నారా, నంద‌మూరి ఫ్యామిలీ వాళ్లు చెట్టు కు ఒక‌ళ్లు.. పుట్ట‌కు ఒక‌ళ్లు అన్న‌ట్టుగా పోటీ చేశారు. చంద్ర‌బాబు కుప్పం నుంచి , బాల‌య్య హిందూపురం నుంచి పోటీ చేశారు. వీరిద్ద‌రికి అవి సిట్టింగ్ సీట్లే.. ఇక లోకేష్ తొలి సారిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారు. ఆయ‌న మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక లోకేష్ తోడ‌ళ్లుడు శ్రీ భ‌ర‌త్ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ సారి వీరు పోటీ చేసే సీట్ల ప్లేస్‌లు మార‌తాయ‌ని అంటున్నారు. వీరితో పాటు సీఎం జ‌గ‌న్ సైతం ఈ సారి సీటు మార్చుకుని పోటీ చేస్తార‌ని అంటున్నారు. విశాఖ ఎగ్జిగ్యూటివ్ క్యాపిట‌ల్ కావ‌డంతో జ‌గ‌న్ అక్క‌డ నుంచి పోటీ చేస్తార‌ని టాక్ ? ప‌వ‌న్ ఎలాగూ గాజువాక లేదా భీమిలి మీద క‌న్నేశార‌ని అంటున్నారు. ఈ సారి కుప్పంతో పాటు చంద్ర‌బాబు కూడా ఉత్త‌రాంధ్ర లో విశాఖ సిటీలో ని నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డో ఓ చోట నుంచి పోటీ చేస్తార‌ని అంటున్నారు.

ఇక లోకేష్ కూడా మంగ‌ళ‌గిరి క‌న్నా భీమిలి లేదా న‌గ‌రంలోని నాలుగు సీట్ల‌లో ఓ చోట నుంచి పోటీ చేస్తే ఎలా ?  ఉంటుందా ? అని ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. ఏదేమైనా ఈ సారి కీల‌క నేత‌ల పోటీతో ఉత్త‌రాంధ్ర రాజ‌కీయం మామూలుగా వేడుక్కేలా లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: