తెలంగాణాలో తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. నేడు ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. గత 20 సంవత్సరాలు గా టిఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోని ,ఎన్నో విజయాలు సాదించిందని అన్నారు. దేశ చరిత్ర లోనే గుర్తుండుపోయేలా తెలంగాణ ఉధ్యమం నడిపించాం అని ఆయన తెలిపారు. స్వియ అస్థిత్వమే శ్రీరామ రక్ష అని ..కేసీఆర్ కు పట్టం కట్టారని అన్నారు. రెండు సార్లు మాకు అధికారం ఇచ్చారు అని హర్షం వ్యక్తం చేసారు.

ప్రభుత్వం ద్వారా ఎన్నో విజయాలు సాధించాం అని అన్నారు కేటిఆర్  . మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా ప్రజలు తెలంగాణ లో కలుస్తామని అక్కడి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అని ఆయన అన్నారు. మరోవైపు కర్ణాటక రాయచూర్ ప్రజలు కూడా తెలంగాణ లో కలుస్తామంటుంన్నారు అని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వానికి తెలంగాణ పథకాలు ఆదర్శమవుతున్నాయి అని కేటిఆర్  పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొడుతుంది అని ఆయన వెల్లడించారు. అర్బన్ ఫారెస్ట్ ను తెలంగాణ లో ఎలా అభివృద్ధి చేస్తున్నారు అని చూడడానికి కేంద్ర ప్రతినిధులు వచ్చారు అని  కేటిఆర్  అన్నారు.

తెలంగాణ అభివృద్ధి ని భారతదేశం ఆచరించక తప్పదనే పరిస్థితి వచ్చింది అని కేటిఆర్  వివరించారు. ప్లీనరీ , మా పార్టీ అధ్యక్షుడి ఎన్నిక మాకు అత్యంత కీలకమైనవి అని అన్నారు. ఈ పార్టీ ప్లీనరీ కమిటీకి ఆహ్వాన కమిటీ.. సబితా ఇంద్రారెడ్డి, రంజిత్ రెడ్డి, గాంధీ, మేయర్ అలాగే సభా ప్రాంగణం... గ్యాదరి బాలమల్లు ,మారెడ్డి శ్రీనివాస్, మాగంటి ,బొంతు రామ్మోహన్, వాలంటీర్ కమిటీ... శంబీపూర్ రాజు ఉంటారని వివరించారు. 4వేల వాహనాలు వచ్చే అవకాశం ఉంది.. ఇబ్బంది కాకుండా పార్కింగ్ స్థలాలు గుర్తించాం అన్నారు. పార్కింగ్ కమిటీ... వివేకానంద గౌడ్ ,బండి రమేష్ ఉంటారని ఫుడ్ కమిటీ.. మాధవరం కృష్ణారావు ఉంటారని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr