దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రసాదాలు తీసుకోవడం సంప్రదాయం అని ముఖ్యమంత్రి ప్రసాదం తీసుకొనే ఉంటారు.. ఆయనే తిన్నారు నేను అని అనుకుంటున్నాను అంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యాఖ్యలు చేసారు. కానీ కొందరు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి ప్రసాదం వాసన చూస్తున్నట్టు ఉంది అని కామెంట్ చేస్తున్నారు అని అన్నారు ఆయన. సీఎం వస్త్రాలు ఒక్కరే సమర్పించారు...సతీమణి కూడా లేరు అని విమర్శలు చేసారు. కేసీఆర్ ఏ పూజ చేసినా సతీమణి తో కలిసి చేస్తారు అది ధర్మం అని అన్నారు.

తిరుపతిలో జగన్ పిన్నిగారు జగన్ రెడ్డి రక్షక అనే వీడియోలు కూడా వచ్చాయి అని పేర్కొన్నారు. రాలుతున్న నవరత్నాలు అనే అనుమానం ప్రజల్లో వచ్చింది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. గొంతుతడిగా మారిన అమ్మఒడి పధకం అంటూ రెండు ఏళ్ళు అమ్మఒడి ఇచ్చారు అని ఎద్దేవా చేసారు. ఇప్పుడు జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడి జూన్ లో ఇస్తామని అంటున్నారు అని విమర్శలు చేసారు. ఒక ఏడాది పాటు అమ్మఒడి నవరత్నాలు రాలిపోయే పరిస్థితి వచ్చింది అని విమర్శలు చేసారు. ఆర్ధిక లోటు తోనే ఈ ఇబ్బందులు వస్తున్నాయి అన్నారు.

రాలుతున్న రత్నాలు గమనిస్తే చాలా మంది విజ్ఞులు సూచన చేస్తున్నారు అని అన్నారు. అమ్మఒడిని అమ్మబడిగా మార్చాలని సూచన చేస్తున్నారు అని అమ్మఒడి కి ఇచ్చే డబ్బులను పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు ఉపయోగిస్తే బాగుండు అని అంటున్నారు అని వ్యాఖ్యలు చేసారు. మద్యపాన నిషేదం అన్నారు...కొందరి ఆదాయం కోసం మద్యపానం కొనసాగిస్తున్నారు అని విమర్శలు చేసారు. ఢిల్లీలో లాగా ఏపీ స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు రూపొందిస్తే బాగుండు అని ఆయన కోరారు. అమ్మఒడి పధకం రాకముందు... వచ్చిన తర్వాత ఎంత మంది విద్యార్థుల డ్రాప్ ఔట్ అయ్యారో  లెక్కలు ఏమైనా ఉన్నాయా అని నిలదీశారు. అమ్మఒడి పధకం పైసలు నాన్న బుడ్డికి వెళ్తున్నాయి...మద్యం తయారు చేసే మరో మూడు కంపెనీలకు నిధులు వెళ్తున్నాయి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: