ఓ మ‌హిళ నిండు గ‌ర్భిణి. ఆమె రైలులో ప్ర‌యాణించాల్సి వ‌చ్చింది. ప్ర‌యాణిస్తున్న త‌రుణంలో అక‌స్మాత్తుగా నొప్పులు వ‌చ్చాయి. ఆమె రైలుమార్గంలోనే ప్ర‌యాణించి ఒక‌క ప్ర‌దేశం వ‌ద్ద దిగి ఆస్ప‌త్రికి బ‌య‌లుదేరింది. నొప్పులు ఎక్క‌వ అవ్వ‌డంతో అక్క‌డే ఉన్న మ‌హిళాకార్మికులు పురుడుపోశారు. దీంతో ఆమె పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. దాదాపు 20 కీమీ దూరం నుంచి అంబులెన్స్ వ‌చ్చే వ‌ర‌కు వూచి చూడ‌కుండా స్థానికులే ఆమెకు పురుడుపోసి మాన‌వ‌త్వం చాటుకున్నారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లా మ‌ధిర‌లోని రైల్వేస్టేష‌న్ వ‌ద్ద జ‌రిగింది.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌కాశం జిల్లా పామురు గ్రామానికి చెందిన యాసార‌పు మార్త‌మ్మ నిండు గ‌ర్భిణి. ఆమె భ‌ర్త ర‌మేష్‌తో క‌లిసి నిజామ‌బాద్‌లో కూలీ ప‌నులు చేసుకుంటూ జీవిస్తున్న‌ది. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ఆమె త‌న త‌ల్లిగారి ఇంటికి వెళ్లేందుకు కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కింది. అక్క‌డే ఆ దంప‌తులు దిగి బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా.. ఆమె నొప్పులు భ‌రించ‌లేక కూల‌ప‌డిపోయింది. స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లోనే ఆగిపోయింది నొప్పుల‌కు త‌ట్టుకోలేక‌. విష‌యం తెలుసుకున్న మ‌ధిర రైల్వేష్టేష‌న్ హెడ్‌కానిస్టేబుల్ వేణుగోపాల్ రెడ్డి 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ రావాలంటే 20 కీమీ దూరం నుంచి బ‌నిగండ్ల ప్రాథ‌మిక ఆరోగ్య‌కేంద్రం నుంచి రావాలి.

అంబులెన్స్ రావడానికి స‌మ‌యం ప‌డుతుండ‌డంతో..  ఏమి చేయాలో అర్థం కాక ఆమెకు నొప్పులు ఇంకా తీవ్ర‌త‌రం అయ్యాయి. వేణుగోపాల్ రెడ్డి స్థానిక స్వ‌చ్ఛంద సేవ చేసే మ‌ధిర రెస్క్యూటీమ్ రామ‌కృష్ణ‌కు స‌మాచారం చేర‌వేశారు. హుటాహుటిన అత‌ని భార్య జ్యోతితి క‌లిసి రామ‌కృష్ణ‌ అక్క‌డిని చేరుకున్నాడు. స్టేష‌న్ స‌మీపంలోనే ఒక మార్కెట్ ఉన్న‌ది. అక్క‌డికి కూర‌గాయ‌లు కొన‌డానికి వ‌చ్చిన ఉద్యోగి గ‌జ్జ‌ల‌కొండ శివ‌కూడా స్థ‌లానికి చేరుకున్నారు. ఓ పారిశుధ్య‌కార్మికురాలు ఉన్నారు. వీరంద‌రూ క‌లిసి ఆమెను స‌హాయం చేసి సాధార‌ణ కాన్పు చేశారు. ఆమె ఆడ‌పిల్ల‌కు జ‌న్మనిచ్చింది. వెంట‌నే రామ‌కృష్ణ దంపతులు ఆమెను ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం త‌ల్లీ, బిడ్డ‌లు క్షేమంగా ఉన్నార‌ని వైద్యులు దృవీక‌రించారు. స‌హాయం చేసిన ప్ర‌తీ ఒక్కరికీ మార్త‌మ్మ‌, ఆమెభ‌ర్త రామేష్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.
దీంతో ర‌మేష్ సంతోషం అంతా ఇంతా కాదు.







మరింత సమాచారం తెలుసుకోండి: