హుజూరాబాద్ నియోజకవర్గ  ఉప ఎన్నిక తరహాలోనే బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా తెలుగు రాష్ట్రాల్లో చర్చ నీయాంశంగా తయారైంది.  కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానం సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందిన సంగతి అందరికీ.  ఈ నేపథ్యంలోనే బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలు జరిగే రోజునే...బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నిక జరుగుతోంది. అంటే అక్టోబర్ 30వ తేదీన హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా జరుగుతోంది. అయితే బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కేవలం... అధికార వైసిపి, భారతీయ జనతా పార్టీ మరియు  కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా బరిలో ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణం తరువాత అతని భార్య కే  వైసీపీ టిక్కెట్ ఇచ్చిన నేపథ్యంలో... తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు బద్వేలు ఉప ఎన్నిక నుంచి తప్పుకున్నాయి.  

ఇక అంటూ భారతీయ జనతా పార్టీ మాత్రం... బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా అంటూ బరిలో దిగుతున్న బిజెపి పార్టీ.  సీనియర్ నాయకుడు పుంతల సురేష్ ను బద్వేల్ బరిలో దించింది భారతీయ జనతా పార్టీ. జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలు తప్పుకోవడంతో... అధికార వైసిపి పార్టీ మరియు బిజెపి పార్టీ ల మధ్య మాత్రమే ఈ పోరు జరగనుంది. అయితే ఈ బద్వేల్ పోరులో భారతీయ జనతా పార్టీకి అసలు డిపాజిట్ దక్కుతుందా అనే చర్చ సాగుతోంది. గత 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల లెక్కలను చూస్తుంటే... ఈ ప్రశ్న అందరిలోనూ మెదలక తప్పదు. 2019 ఎన్నికల్లో బద్వేలు ఎన్నికల్లోనూ బీజేపీ పోటీ చేసింది.

అయితే.. అప్పుడు బిజెపి అభ్యర్థి కేవలం 735 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. బద్వేల్ నియోజకవర్గం లో సుమారు రెండు లక్షల 20 వేల ఓట్లు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అందులో 2019 సంవత్సరంలో లక్ష యాభై వేలకి పైగా మంది ఓటు వేశారు. అయితే ఇందులో భారతీయ జనతా పార్టీకి మాత్రం 735 మంది మాత్రమే ఓటు వేయడం గమనార్హం. దీంతో ఈసారి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్లు దక్కవు ఉందా ? లేదా ? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది.  ఒకవేళ డిపాజిట్ దక్కక పోతే... భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏపీలో ఏ విధంగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారట. అయితే దీని పై క్లారిటీ రావాలంటే అక్టోబర్ 2వ తేదీ వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: