ప్రస్తుతం భారత సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓ వైపు పాకిస్తాన్‌తో వివాదం... మరో వైపు దురాక్రమణకు ప్రయత్నిస్తున్న చైనా... ఇదే సమయంలో ఇప్పటికే కొద్ది రోజులగా సైలెంట్‌గా ఉన్న పొరుగుదేశం... ఇప్పుడు కాశ్మీర్‌లో రెచ్చిపోతోంది. కశ్మీర్‌లో అమాయకులను బలి తీసుకుంటోంది. ఇందుకోసం ఉగ్రవాదాన్ని ప్రొత్సహిస్తోంది పాకిస్తాన్. ఇప్పటికే సరిహద్దుల్లో తరచూ కాల్పులకు తెగబడుతోంది పాకిస్తాన్. అదే సమయంలో ఉగ్రవాదులు కాశ్మీర్‌లో దాదాపు పది మంది వరకు పొట్టన పెట్టుకున్నారు. సాధారణ పౌరులను టార్గెట్ చేసుకోవడంపై కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు ఘాటుగా బదులిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఉగ్రవాదుల్ని ప్రొత్సహిస్తే... మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం... రెడీగా ఉండాలంటూ హెచ్చరించారు అమిత్ షా. భారత్‌పై ఎవరు దాడి చేసేందుకు యత్నించినా కూడా సమర్థవంతంగా తిప్పికొడతామని అమిత్ షా వార్నిగ్ ఇచ్చారు. గోవాలో జరిగిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు.

రక్షణ శాఖ మాజీ మంత్రి, దివంగత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ సారధ్యంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌ను అమిత్ షా గుర్తు చేశారు. పారికర్ హాయంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఓ కీలక అడుగుగా అభివర్ణించారు అమిత్ షా. దేశ సరిహద్దుల్లో ఎలాంటి ఆటంకాలు సృష్టించినా కూడా ఊరుకునేది లేదని హెచ్చరించారు. గతంలో చర్చలు జరిగేవని... కానీ ఇప్పుడు మాత్రం... ధీటుగా బదులిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. గతంలో జరిగిన ఉరీ, పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్‌లలో పాకిస్తాన్ ఉగ్రమూకలు చేసిన దాడులకు భారత్ ఇప్పటికే ప్రతీకారం తీర్చుకున్నట్లు అమిత్ షా వెల్లడించారు. పాకిస్తాన్‌లోని ఉగ్రమూకల స్థావరాలపై ఇప్పటికే మెరుపు దాడులు చేసి ధ్వంసం చేసినట్లు షా తెలిపారు. ఇప్పటికే భారత్ చేసిన దాడుల్లో 300 మంది పైగా ఉగ్రవాదులు హతమైనట్లు తమ వద్ద నివేదిక ఉందన్నారు. ప్రస్తుతం సైన్యంలో పనిచేసే అందరికీ వన్ ర్యాంక్... వన్ పెన్షన్ విధానాన్ని మాజీ సీఎం మనోహర్ పారికర్ అమలు చేశారని షా కీలక వ్యాఖ్యలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: