తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలకు బాగానే కసరత్తు చేస్తోంది. పార్టీ విధానాలను నినాదాలను కూడా రెడీ చేసుకుంటోంది. ఏ విధంగా మాట్లాడితే జనాలకు అట్రాక్ట్ అవుతామని కూడా ఆలోచించుకుంటోంది. ఇక వైసీపీ సర్కార్ ని ఎలా ఎండగట్టాలో కూడా టీడీపీ సరైన వ్యూహాన్ని రూపొందిస్తోంది.

ఇవన్నీ ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లొ అనుభవం అంటూ చెప్పుకుని అధికారంలోకి వచ్చింది. అయిదేళ్ల పాలనలో కొన్ని వైఫల్యాల వల్ల ఆ పార్టీ ఓడిపోయింది. దాంతో పాటు జగన్ అనే ఫ్యాక్టర్ ఒకటి బాగా పనిచేసింది. బాబు కంటే జగన్ ఏదో చేస్తాడు అని జనాలు ఆశించారు. జగన్ కూడా అప్పటికి పదేళ్ళుగా జనాల్లో ఉంటూ పోరాడుతున్నారు. దాంతో ఆయనకు ఒక చాన్స్ ఇచ్చారు.

అయితే జగన్ కొన్ని వ్యూహాత్మకమైన తప్పులు చేశాడని టీడీపీ భావిస్తోంది. రేపటి రోజున ఎన్నికల్లో అవే తమకు ఆయుధాలు అవుతాయని కూడా ఊహిస్తోంది. జగన్ అన్ని హామీలు ఒకేసారి నెరవేర్చాలన్న ఆత్రుతతో పధకాల పంట పండించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా కరోనా రావడం, దానికి ముందే రాష్ట్ర ఖజాజా ఇబ్బందులో పడడంతో జగన్ కేవలం రెండేళ్లలోనే విమర్శల పాలు అవుతున్నారు.

ఇక ఎన్నికల నాటిని నవరత్నాలలో ఎన్ని అమలు కాకుండా ఉండిపోతాయో తెలియని పరిస్థితి. మరో వైపు చూస్తే జగన్ అనుభవ రాహిత్యం పాలనా పరమైన వైఫల్యాలు ఇవే తమ ఆయుధాలుగా చేసుకోవాలని వైసీపీ గట్టిగా భావిస్తోంది. అనుభవం లేని వారిని తెచ్చి గద్దె మీద పెడితే పాలన ఎలా ఉంటుంది అన్నదే టీడీపీ జనాలకు చెప్పాలనుకుంటోంది. మరి ఇంకా సగం పాలన ఉంది కాబట్టి ఈ లోగా జగన్ సర్కార్ తప్పులను ఒప్పులుగా చేసుకోగలిగితే కచ్చితంగా రేపటి ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమనే అంటున్నారు. చూడాలి మరి జగన్ గెలుస్తారా, ఆయన మీద టీడీపీ ప్రయోగించే ఆయుధాలు గెలుస్తాయా అన్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: