ఏపీలో అధికార వైసీపీకి ఎంత తిరుగులేని బలం ఉన్నా సరే... కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి అసలు సరైన నాయకత్వం లేకపోవడం ఆశ్చర్యపోయే అంశం. అసలు ప్రతి జిల్లాల్లోనూ వైసీపీకి బలం ఉంది...అలాంటప్పుడు కొన్నిచోట్ల వైసీపీకి సరైన ప్రాతినిధ్యం లేకపోవడం కాస్త వింతగానే ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలో వైసీపీకి సరైన నాయకత్వం లేదనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి తరుపున రామ్మోహన్ నాయుడు విజయం సాధిస్తూ వస్తున్నారు.

అయితే రెండుసార్లు వైసీపీ నాయకులని మార్చింది...అయినా ప్రయోజనం లేదు....ప్రస్తుతానికి పార్లమెంట్‌లో వైసీపీని నడిపించే నాయకుడు ఎవరూ లేరు. 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ తరుపున రెడ్డి శాంతి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలోచ్చేసరికి రెడ్డి శాంతిని పాతపట్నం అసెంబ్లీ బరిలో నిలబెట్టగా, శ్రీకాకుళం పార్లమెంట్ బరిలో దువ్వాడ శ్రీనివాస్‌ని నిలబెట్టారు. అటు రెడ్డి శాంతి ఎమ్మెల్యేగా గెలిచారు...కానీ ఇటు దువ్వాడ మాత్రం ఓడిపోయారు.

ఇక ఎన్నికలయ్యాక వైసీపీ మళ్ళీ స్ట్రాటజీ మార్చేసింది. దువ్వాడని టెక్కలి అసెంబ్లీ ఇంచార్జ్‌గా పంపించేశారు. దీంతో శ్రీకాకుళం పార్లమెంట్‌లో రామ్మోహన్‌కు ప్రత్యర్ధి లేకుండా పోయారు. అయితే ఎన్నికల సమయం కంటే ఇప్పుడే ఒక అభ్యర్ధిని పెడితే వైసీపీ పుంజుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే కాకుండా మళ్ళీ ఎన్నికల సమయంలో అభ్యర్ధిని మార్చి పెడితే ఆటోమేటిక్‌గా రామ్మోహన్‌కే బెనిఫిట్ అయ్యేలా ఉంది.

నెక్స్ట్ ఎన్నికల్లో దువ్వాడ ఎలాగో టెక్కలి బరిలోనే దిగుతారని తెలుస్తోంది. మరి శ్రీకాకుళం పార్లమెంట్ బరిలో ఎవరిని నిలబెడతారనేది క్లారిటీ లేదు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని నెక్స్ట్ వైసీపీ తరుపున నిలబెట్టే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. అటు పేరాడ తిలక్‌కు కూడా ఛాన్స్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో తిలక్...టెక్కలిలో పోటీ చేసి అచ్చెన్నాయుడుపై ఓడిపోయారు. ఇప్పుడు టెక్కలిలో వైసీపీ బాధ్యతలు దువ్వాడ చూసుకుంటున్నారు. కాబట్టి తిలక్‌ని పార్లమెంట్ స్థానం బరిలో దింపే అవకాశాలు లేకపోలేదు. చూడాలి మరి రామ్మోహన్ ప్రత్యర్ధిగా ఎవరిని డిసైడ్ చేస్తారో?    

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp