అవంతి శ్రీనివాస్....రాజకీయంగా కాస్త అదృష్టం ఎక్కువ ఉన్న నేత అని చెప్పొచ్చు. ఎందుకంటే అవంతి ప్రతిసారి అధికార పార్టీలోనే ఉంటున్నారు. 2009లో అవంతి ప్రజారాజ్యం తరుపున భీమిలిలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక 2014 ఎన్నికల్లో టి‌డి‌పి తరుపున...అనకాపల్లి ఎంపీగా గెలిచారు. అప్పుడు కూడా టి‌డి‌పి అధికారంలో ఉంది. 2019 ఎన్నికలోచ్చేసరికి అవంతి...వైసీపీ వైపుకు వచ్చేశారు. వైసీపీ తరుపున భీమిలిలో పోటీ చేసి గెలిచారు.

వైసీపీ ఎలాగో అధికారంలోకి వచ్చింది....అధికారమే కాదు...విశాఖపట్నం జిల్లాలో ముందు నుంచి వైసీపీలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నా సరే, వారికి ఎవరికి దక్కని మంత్రి పదవి అవంతికి దక్కింది. విశాఖలో ఒక్క అవంతికి మాత్రమే మంత్రి పదవి దక్కిందంటే....అవంతి అదృష్టం ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పటివరకు అదృష్టం వెంటాడిన అవంతిని....ఇకనుంచి దురదృష్టం కూడా వెంటాడే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

ఎందుకంటే ఈ మధ్య అవంతిపై ఎలాంటి ఆరోపణలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు సంబంధించిన ఆడియోలు బాగా వైరల్ అయ్యాయి. దీని వల్ల అవంతికి కాస్త నెగిటివ్ వచ్చిందనే చెప్పొచ్చు. దీనికి తోడు త్వరలోనే జగన్ మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. ఈ క్రమంలోనే అవంతి మంత్రి పదవి పోనుందని తెలుస్తోంది.

సరే ఎలాగో రెండున్నర ఏళ్ళు మంత్రిగా చేశారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇదే కాదు...నెక్స్ట్ ఎన్నికల్లో అవంతికి అదృష్టం రివర్స్‌ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకు వరుసగా గెలుస్తూ వచ్చిన అవంతికి... ఈసారి భీమిలిలో అదృష్టం అడ్డం తిరగవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేనలు కలిసి పోటీ చేయొచ్చని ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే అవంతి గెలుపుకు ఇబ్బందే...ఎందుకంటే గత ఎన్నికల్లో అవంతికి టి‌డి‌పి మీద వచ్చిన మెజారిటీ దాదాపు 10 వేల ఓట్లు...కానీ అక్కడ జనసేనకు పడిన ఓట్లు 24 వేల ఓట్లు...అంటే పవన్-టి‌డి‌పికి మద్ధతు ఇస్తే అవంతికి మళ్ళీ ఛాన్స్ రాకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: