ఏపీలో జనసేనకు పెద్దగా బలం లేదనే గత ఎన్నికల్లోనే రుజువు అయిపోయింది...ఆ పార్టీ కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకోగలిగింది అంటే...ఆ పార్టీ సత్తా ఏంటో, పవన్ కల్యాణ్ సత్తా ఏంటో క్లారిటీ వచ్చేసింది. ఎన్నికలై రెండున్నర ఏళ్ళు కావొస్తున్న సరే....ఏపీలో జనసేన పుంజుకోలేదు...ఇప్పటికీ ఆ పార్టీకి అదే బలం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే జనసేన సింగిల్‌గా సత్తా చాటడం కష్టమే. అటు టి‌డి‌పి సైతం బలంగా ఉన్న వైసీపీని ఎదుర్కొలేకపోతుంది. టి‌డి‌పి బలం ఏమి తక్కువ కాదు....కానీ వైసీపీని ఢీకొట్టే అంత బలం మాత్రం రావడం లేదు. అదే జనసేనని కలుపుకుంటే టి‌డి‌పికి ఆ బలం వచ్చేస్తుంది.

అందుకే ఈ రెండు పార్టీలు పొత్తు దిశగా ముందుకెళుతున్నాయని ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. సరే పొత్తు ఉంటే రెండు పార్టీలకు లాభమే తప్ప, నష్టం ఉండదు. ఒకవేళ విడిగా పోటీ చేస్తే మాత్రం పరిస్తితి వేరుగా ఉంటుందనే చెప్పొచ్చు. అయితే కలిసి పోటీ చేస్తే జనసేన ఖచ్చితంగా కొన్ని సీట్లు మాత్రం లాగేస్తుందని బాగా అర్ధమవుతుంది. గత ఎన్నికల్లోనే కలిసి పోటీ చేసి ఉంటే జనసేన ఒక సీటుకు పరిమితమయ్యేది కాదు. కనీసం ఓ 10 పైనే సీట్లు గెలుచుకునేది. అలాగే పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల గెలిచేవారు.

ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన ఎక్కువ సీట్లు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో వెస్ట్‌లో జనసేనకు ఓట్లు బాగానే వచ్చాయి. అయితే జనసేన ఖచ్చితంగా భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం సీట్లు తీసుకుంటుందని తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో భీమవరం, నరసాపురం స్థానాల్లో రెండో స్థానంలో తాడేపల్లిగూడెంలో టి‌డి‌పితో పాటు ఓట్లు తెచ్చుకుంది. ఈ మూడు సీట్లు తీసుకుని... వీటిల్లో జనసేన పక్కాగా విజయం సాధించడం కూడా జరగొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: