రాజకీయాల్లో అవసరాలకు తగ్గట్టుగానే రాజకీయ నేతలు పనిచేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా...అధికారం లేనప్పుడు మరోకలా నాయకులు మారిపోతారు. అందరినీ ఒకే గాటిన కట్టలేము గానీ....కొందరు మాత్రం అలాగే చేస్తారు. ఇక ఈ కోవలోనే మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వస్తారని చెప్పొచ్చు. కల్పన రాజకీయ జీవితం టి‌డి‌పిలోనే మొదలైంది...టి‌డి‌పిలో బాగానే రాజకీయం చేస్తూ వచ్చారు. 2009 ఎన్నికల్లో పామర్రులో పోటీ చేసి ఓడిపోయారు.

సరే ఓడిపోయిన ఇబ్బంది లేదు...మళ్ళీ కష్టపడితే గెలుస్తామని అనుకోవాలి. కానీ అలా అనుకోలేదు...ఆమె టి‌డి‌పిని వీడి వైసీపీలోకి జంప్ చేశారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున బరిలో దిగి పామర్రులో విజయం సాధించారు. కాకపోతే వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక్కడ కల్పన ఆలోచన మారింది....ఓ వైపు ఎలాగో టి‌డి‌పి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఈ క్రమంలోనే పాత పరిచయాలని ఉపయోగించుకుని కల్పన టి‌డి‌పిలోకి వచ్చేశారు. ఇక అధికారం ఉన్నన్ని రోజులు కల్పనకు ఎలాంటి ఇబ్బంది లేదు.

అయితే 2019 ఎన్నికల్లో కల్పనకు మళ్ళీ ఎదురుదెబ్బ తగిలింది....అనూహ్యంగా జగన్ గాలిలో ఘోరంగా ఓడిపోయారు. ఇటు టి‌డి‌పి ఎలాగో ప్రతిపక్షానికి పరిమితమైంది. దీంతో కల్పన పార్టీలో యాక్టివ్ గా ఉండటం తగ్గించేశారు.  పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం ఒక్కటీ కూడా చేయలేదు. పైగా వైసీపీ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అసలు కల్పనని పామర్రు బాధ్యతల నుంచి తప్పించాలని టి‌డి‌పి శ్రేణుల నుంచి డిమాండ్ వచ్చింది.

ఈ క్రమంలోనే చంద్రబాబు....కల్పనని పక్కబెట్టి....వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజాకు పామర్రు బాధ్యతలు అప్పగించారు. అంటే నెక్స్ట్ పామర్రు సీటు కూడా రాజాదే. దీంతో కల్పన రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడింది. ఇటు టి‌డి‌పిలో ఉన్న ఉపయోగం లేదు...అటు వైసీపీలోకి వెళ్ళిన ఫలితం ఉండదు. అసలు జగన్ మళ్ళీ వైసీపీలోకి రానిస్తారా?అనేది డౌటే...ఒకవేళ వెళ్ళిన సీటు దక్కదు. మొత్తానికి కల్పన పరిస్తితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp