కర్నూలు రాజకీయాలు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం అవకాశం దక్కడం లేదు. గత రెండు ఎన్నికల్లో అదే పరిస్తితి...పోనీ గత ఎన్నికల నుంచి పరిస్తితి గమనిస్తే టి‌డి‌పికి ఏ మాత్రం అనుకూలంగా లేదు. ఎన్నికల్లో ఎలాగో ఒక్కసీటు కూడా గెలుచుకోలేదు. అలాగే పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలనే తేడా లేకుండా ప్రతి ఎన్నికల్లోనూ టి‌డి‌పి చేతులెత్తేసింది. అసలు కాస్త కూడా వైసీపీకి పోటీ ఇవ్వలేదు.

ఈ పరిస్తితిని చూస్తుంటే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా కర్నూలులో టి‌డి‌పికి అంత అనుకూలమైన ఫలితాలు వచ్చేలా కనిపించడం లేదు. ఒకవేళ రాష్ట్రంలో టి‌డి‌పికి అనుకూలంగా ఉన్నా సరే కర్నూలులో మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉండేలా ఉంది. మరి అలాంటప్పుడు ఇక్కడ టి‌డి‌పి నేతలు గెలుపుపై ఆశలు వదులేసుకోవాల్సిన పరిస్తితి వస్తుంది. ముఖ్యంగా భూమా ఫ్యామిలీకి గెలుపు కాస్త దూరంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అసలు ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో భూమా ఫ్యామిలీకి ఎంత పట్టు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

కానీ అది 2019 ఎన్నికల ముందు వరకే....ఆ ఎన్నికల తర్వాత భూమా ఫ్యామిలీ పట్టు తగ్గిపోయినట్లు కనిపిస్తోంది. ఇటు ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, అటు నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డిలకు అంత అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు. ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ఫుల్ స్ట్రాంగ్‌గా ఉంది. ఒక వైపు ఆళ్లగడ్డలో గంగుల బిజేంద్ర రెడ్డి బలంగా ఉన్నారు...మరో వైపు నంద్యాలలో శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి సత్తా చాటుతున్నారు. ఈ ఇద్దరినీ దాటుకుని అఖిల, బ్రహ్మానందరెడ్డిలు విజయం సాధించడం అంత సులువైన పని కాదనే చెప్పొచ్చు.

అయితే అఖిల మొదట నుంచే బాగానే ఫైట్ చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. కానీ ఎన్ని చేసిన ప్రయోజనం ఉన్నట్లు కనిపించడం లేదు. మొత్తానికైతే భూమా ఫ్యామిలీకి టి‌డి‌పిలో కాస్త గెలుపు దూరంగా ఉన్నట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp