20 ఏళ్లగా పాకిస్తాన్ తన దేశంలో తాలిబన్ లను అమెరికాకు కనిపించకుండా దాచుకుని మరీ సాయం చేసింది. కానీ తాలిబన్ లు మాత్రం పాక్ ను కూడా తమది గానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిమధ్య ఇప్పటికే ఆధిపత్య పోరు బ్రహ్మాండంగా సాగుతుంది. అయితే కొన్ని సమాచారాల మేరకు ఇప్పటికే ఐఎస్, తాలిబన్ లు రెండు దాదాపు మూడువంతులు పాక్ ను ఆక్రమించుకొని వాళ్ళ ఇష్టానికి అక్కడ పరిపాలన నియమాలు, నిబంధనలు అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయినా పాక్ తాలిబన్ లకు ఇప్పటి వరకు వెన్నుదండుగానే ఉంది. ఈ విషయాన్ని గ్రహించక పాక్ ఉగ్రవాదులు తమకు సాయంగా ఉంటారని యోచించింది.

అమెరికా నుండి దాచింది, ఇప్పుడు దానికి నిదా లేకుండా చేస్తున్నారు తాలిబన్ లు. దీనితో ఎవరితో చెప్పుకోవాలో తెలియక చావలేక బ్రతకలేక ఉంది పాక్. ఈ స్థితి తానే కొని తెచ్చుకుంది అయినా తనలో ఎటువంటి మార్పులు ఉండబోవు అనేది మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ఒకపక్క చైనా, మరోపక్క ఐఎస్, ఇంకోపక్క తాలిబన్ లు పాక్ ను నంజుకు తినేస్తున్నారు. దీనికంతటికి ప్రారంభం 50 ఏళ్ళ నాడే జరిగింది, ఆనాడు భారత్ ను ఓడించాలని లేక దెబ్బ కొట్టాలని ఐఎస్ సహా పలు తీవ్రవాద సంస్థలకు అండగా ఉంది పాక్. ఐఎస్, తాలిబన్, ఖలిస్థాన్(పంజాబ్) లాంటి అనేక తీవ్రవాద సంస్థలను పెంచి పోషించింది పాక్ అనే చెప్పాలి, అందుకే వాళ్లంతా చేసిన ఛండాలంగా చరిత్రలో పాక్ ఉండిపోతుందేమో!

తాజాగా పాక్ కాబుల్ కు విమాన సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆఫ్ఘన్ ఆక్రమణ జరగగానే తాలిబన్ లు కాబుల్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేశారు. ఇప్పటికి అక్కడ కొన్నియు ఛారిటీలు ఆఫ్ఘన్ ల కోసం వచ్చి పోతున్నారు. అయితే కొన్నాళ్లుగా ధరలు బాగా పెంచేయడంతో ఇబ్బంది పడుతున్న పాక్ ఆ విషయాన్ని తాలిబన్ ప్రభుత్వం తో చెప్పినా పట్టించుకోకపోవడంతో సేవలు ఆపేసింది. అంతేకాదు తాలిబన్ లు పాక్ విమానాలలో ఉన్న సిబ్బందిని కూడా బెదిరిస్తున్నారంటూ కొత్తపాట ప్రారంభించింది పాక్. నిన్నటి దాకా వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళ దేశాన్ని స్వాగతించండి అంటూ హడావుడి చేసిన పాక్ ఇప్పుడు తనవద్దకు వచ్చేసరికే  బాధలు కనిపించాయట!

మరింత సమాచారం తెలుసుకోండి: