తెలంగాణ‌లో కేసీఆర్ చ‌రిష్మా కాస్త త‌గ్గుతున్న‌ద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఎవ‌రికి వారు త‌మ భ‌విష్య‌త్తు వ్యూహాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చిన విధంగా బీజేపీ కూడా ముగ్గ‌రితో చ‌క్రం తిప్పాల‌ని చూస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో సీఎం కేసీఆర్ ఆయ‌న కొడుకు కేటీఆర్ ను రంగంలోకి తీసుకువ‌స్తాడా అనే విష‌యం ఆసక్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో హుజురాబాద్ గెలుపు పై బీజేపీ ఫుల్ ఫోక‌స్ పెట్టిన‌ట్టు అర్థ‌మ‌వుతుంది.  ఎందుకంటే తెలంగాణ‌లో కాషాయ జెండా ఎగురాలంటే కేసీఆర్‌కు ధీటైన నాయ‌కుడు కావాలి.
 

  హుజురాబాద్ గెలుపుతో ఈట‌ల‌ను తెర‌మీద‌కు తీసుకురావాల‌ని గెలుపు కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బండి సంజ‌య్‌, ఈట‌ల రాజేంద‌ర్‌, డీ.కే ఆరుణ‌ను రంగంలోకి దించాల‌ని వ్యూహ ర‌చ‌న చేస్తున్న‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా బండి సంజ‌య్ గురించి చెప్పాల్సి వ‌స్తే పాద‌యాత్ర‌తో జ‌నంలో బీజేపీ పై ఒక స్పెష‌ల్ ఫోక‌స్ తెప్పించారనే చెప్పాలి. అయితే, ఇది అధికారం తీసుకువ‌చ్చే విధంగా ఉంటుందా అంటే చెప్ప‌లేం కానీ, అధిష్టానం ద‌గ్గ‌ర గుర్తింపు తెచ్చుకున్నారు. బీసీ నాయ‌కుడు కాబ‌ట్టి ఆయ‌న‌కు డోకా లేద‌నే చెప్పాలి.


   ఫ్లోర్ లీడ‌ర్‌గా ఈట‌ల రాజేంద‌ర్ ఉంటారు. ఇక డీ.కె అరుణ సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కురాలు, మ‌హిళ అందులో మంత్రిగా ప‌ని చేసిన అనుభవం ఉంది. అంతేకాదు తెలంగాణ‌లో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం రెడ్డి స‌మాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. అలాగే 2023 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఆమెను ప్ర‌చార క‌మిటీ క‌న్వీన‌ర్‌గా నియ‌మించాల‌ని భావిస్తున్నారు. అలాగే బీజేపీ జాతీయ క‌మిటీలో ప్ర‌ముఖ స్థానాన్ని క‌ల్పించారు. మ‌రో వ్య‌క్తి ఈట‌ల హుజురాబాద్ రాజ‌కీయాలే కాదు తెలంగాణ రాజ‌కీయాలు ఈయ‌న చుట్టు తిరుగుతున్నాయి. ఈట‌ల గెలిస్తే కేసీఆర్ అధికారానికి కాలం చెల్లిన‌ట్టేన‌ని అనుకుంటున్నారు. ఈ ముగ్గురితో 2023లో బీజేపీ చ‌క్రం తిప్ప‌నుంద‌ని తెలుస్తోంది.






మరింత సమాచారం తెలుసుకోండి:

bjp