ఏపీ రాజ‌కీయాల‌ను అనూహ్య మ‌లుపులు తిరుగుతున్నాయి. అక్క‌డ అధికారంలో ఉన్న వైసీపీ పై పోరాటంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ కాస్త వెనుక‌బ‌డిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆ పార్టీ స్థానాన్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ భ‌ర్తి చేస్తున్న‌ట్టు అనిపిస్తోంది. ప్ర‌భుత్వ విధానాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ఘాటుగా ప్ర‌శ్నిస్తున్నాడు. మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్య‌ల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు ప‌వ‌న్‌. ఉండ‌వ‌ల్లి లాంటి రాజ‌కీయ ఉద్దండులు మాట్లాడిన మాట‌ల‌ను బ‌ట్టి రాష్ట్ర ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చ‌ని పేర్కొన్నారు ప‌వ‌న్‌.


   దిగ‌జారుడు ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై జ‌న‌సేనాని ఆందోళ‌న వ్య‌క్తం చేశాడు. రాష్ట్రం ఆర్థిక ప‌రిస్థితిపై ఉండ‌వ‌ల్లి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు ఉండ‌వ‌ల్లి వ్యాఖ్య‌ల‌ను ప‌వ‌న్ అస్త్రంగా మార్చుకున్నారు. ప్ర‌భుత్వం విఫ‌లాలను ఆయుధంగా చేసుకుని ప‌వ‌న్ సిద్ద‌మ‌వుతున్నాడ‌నే సంకేతాల‌ను పంపుతున్నాడు. ఏపీ ఆర్థిక ప‌రిస్థితిపై రౌండ్ టేబుల్ స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని జ‌న‌సేనాని నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని వార్త‌లు వెలువ‌డ్డాయి. ఈ స‌మావేశంలో మేధావుల అభిప్రాయాల‌ను తీసుకుని సుదీర్ఘ కార్యాచ‌ర‌ణ రూపొందించి విస్థృతంగా ప్ర‌చారం చేయాల‌నే భావ‌న‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

గ‌తంలో సీఎం జ‌గ‌న్, మంత్రుల‌పై వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు గుప్పించిన ప‌వ‌న్ ఇప్పుడు త‌న రూట్ మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ప‌వ‌న్ దృష్టి పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాను ఎండ‌గ‌డుతూ ప్ర‌జ‌లకు చేరువయ్యేందుకు ప‌వ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అక్టోబ‌ర్ 2వ తేదిన జ‌న‌సేన నిర్వ‌హించిన శ్ర‌మ‌ధాన కార్య‌క్ర‌మానికి మంచి స్పంద‌న వ‌చ్చింది.



 ఇదే కోవ‌లో ప‌వ‌న్ మ‌రింత దూకుడు పెంచారు. మ‌రోవైపు 2024 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ఏపీలో కుల రాజ‌కీయాల ప్రాధాన్య‌త‌ను ప‌వ‌న్ తెర‌మీద‌ర‌కు తెస్తున్నార‌ని చ‌ర్చ న‌డుస్తోంది. కులాల‌కు, మ‌తాల‌కు అతీతం అన్న ప‌వ‌న్ అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. అన్ని వ‌ర్గాల‌ను ఏకం చేస్తూ సీఎం సీటు వైపు న‌డ‌వాల‌ని ప‌వ‌న్ డిసైడ్ అయిన‌ట్టు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. మ‌రి ఈ రూటు జ‌న‌సేనానికి అధికారాన్ని  తెచ్చిపెడుతుందా లేదా అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: