కృష్ణపట్నంలో ఏం జరుగుతోంది ?

కృష్ణపట్నం. పేరులో పట్టణాన్ని చేర్చుకుని ఉన్నఒక  పెద్ద గ్రామం.  తూర్పు తీరంలోని ఆ గ్రామంపై దేశ వ్యాప్తంగా పలువురి దృష్టి పడింది.  ఇందుకు కారణం అక్కడ ఒక ప్రైవేటు పోర్టు ఉంది. ప్రస్తుతం అది ఆదానీల అజమాయిషీ కింద ఉంది.  ఈ పోర్టుకు చుట్టు పక్కల పలు విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. అన్నీ కూడా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే కావడం గమనార్హం. ఇక్కడ ఉన్న పవర్ ప్రాజెక్టులలలో  తెలుగు రాష్ట్రాలకు  విద్యత్ ను అందించే జెన్ కో ఉంది. దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. పలు  ప్రైవేటు థర్మల్ విద్యుత్  కేంద్రాలున్నాయి. విద్యుత్ కు  దేశ వ్యాప్తంగా కొరత ఏర్పడిన నేపథ్యంలో భారత్ లోని వివిధ రాష్ట్రాలు,  పలువురు పారిశ్రామిక వేత్తలు, కృష్ణపట్నం వైపు దృష్టి సారించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  ఎప్పటికప్పుడు కృష్ణ పట్నం జరుగుతున్న  పరిణామాల ను తెలుసుకుంటూ  అప్ డేట్ లో ఉన్నారు.
 కృష్ణపట్నం సమీపంలోని ముత్తుకూరు, తోటపల్లి గూడూరు  మండలాల పరిధిలో  జెన్ కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం,  సెంబ్ కార్ప్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. జెన్ కో ప్రభుత్వ రంగ సంస్థ కాగా, సెంబ్ కార్ప్ ప్రైవేటు సంస్థ. సెంబ్ కార్ప్ సంస్థ ఉత్పత్తి సామర్ద్యం4,240 మెగావాట్లు కాగా,  ప్రస్తుతం ఈ సంస్థ 2640 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్లాంట్ లో కేవలం వారం రోజులకు మాత్రమే నిల్వలున్నాయి.

 దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో రెండు యూనిట్లలో ఉత్పత్తి జరుగుతుంది. ఈ కేంద్రంలో ఎనభై వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు అక్కడి అధికారులు పేర్కోంటున్నారు.  దీనికి అదనంగా మరో డెబ్బైఐదు వేల మెట్రిక్ టన్నుల బొగ్గు తజాగా దిగుమతి జరుగుతోంది.  ఇక్కడి రెండు యూనిట్లూ నిరంతరం విద్యుత్ ను ఉత్పత్తి చేసే పరిస్థితి లేదు. దీనికి కారణం బొగ్గు నిల్వలు  తక్కువ కావడమే  ప్రధాన కారణం. నిరంతరం విద్యుత్ ఉత్పత్తి జరగాలంటే రోజుకు పదహారు వేల టన్నులకు పైగా బొగ్గు అవసరం అవుతుంది. ఇక్కడ ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న  విద్యుత్ కేవలం 865 మెగావాట్ లు మాత్రమే.
ప్రభుత్వ రంగ సంస్థ జెన్ కో లో రెండు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుండగా ఒకటి మాత్రమే విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. మరోక ప్లాంట్ ను మెయింటినెన్స్  పనులు చేస్తున్న కారణంగా ఇక్కడి విద్యుత్ ఉత్పత్తి కావడం లేదు. ఇక్కడ ఉత్పత్తికి రోజూ ఎనిమిది వేల టన్నుల బొగ్గు అవసర మవుతుంది. ఇక్కడ ఉండే నిల్వలు కేవలం 30 వేల టన్నులు మాత్రమే. దీంతో ఇక్కడ  కొద్ది రోజులు మాత్రమే ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది. ఒడిశా పోర్టు నుంచి ఇక్కడికి బొగ్గు  నిల్వలు వస్తాయని జెన్ కో అధికారులు పేర్కోంటున్నారు. ఎంత మేర నిల్వలు పెరుగుతాయనే విషయం మాత్రం ఎవ్వరూ బహిర్గతం చేయడం లేదు.
సంతోషించ తగ్గ విషయం ఒకటుంది. కృష్ణ పట్నం పోర్టులు  తాజాగా మూడు నౌకలు లంగర్లు వేశాయి. ఇది జెన్ కో, సెంట్ కార్ఫ్ సంస్థలకు బొగ్గు అందించ నున్నాయి.  జెన్ కోకు ప్రత్యేకంగా ఉన్న కన్వేయర్ బెల్లు ద్వారా నౌకలో నుంచి బొగ్గు నేరుగా పవర్ ప్లాంట్ లోకి చేరుతుంది. సెంట్ కార్ప్ సంస్థకు కూడా ఈ నౌకల నుంచే  బొగ్గు దిగుమతి అవుతుందని  పోర్టు అధికారులు పేర్కోంటున్నారు. ఏ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా ముందు చూపుతో వ్యవహరించ డం లేదు. తమ సామర్థ్యానికి తగ్గట్లు  నిల్వలు ఉంచుకో లేదు. ఇదేే పరిస్థితి కొన సాగితే  మరో పక్షం రోజుల తరువాత ఇక్కడి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నీ మూత పడే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: