హుజురాబాద్ ఉప స‌మరంలో ఎలాగైన గెల‌వాల‌నే పట్టుద‌ల‌తో మాజి మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఉన్నారు.   ఈట‌ల వైఫ‌ల్యాల‌ను ప్ర‌ధానంగా త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లేందుకు చూస్తున్నారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తాను మ‌మేకమై పోరాటం సాగించిన తీరు, ఆ స‌మ‌యంలో త‌గిలిన ఎదురు దెబ్బ‌ల‌ను, క‌ష్ట న‌ష్టాల‌ను ప్ర‌జ‌ల ముందుపెడుతూ ప్ర‌చారాన్ని సాగిస్తున్నారు. ఇదే సమ‌యంలో పార్టీ అధినేత కేసీఆర్ త‌న ప‌ట్ట వ్య‌వ‌హ‌రించిన తీరు, స‌హ‌చ‌ర మంత్రుల శైలిని ఎండ‌గ‌డుతూ ప్ర‌చార ప‌ర్వంలో దూసుకెళ్తున్నారు.


 త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై ప్ర‌జ‌ల్లో త‌న‌కు ఉన్న సానుభూతి ప‌వనాలే విజ‌య తీరాలు చేర్చే అంశాలుగా భావిస్తున్నాడు ఈట‌ల‌. 2018 వ‌ర‌కు క‌మ‌లాపూర్‌, హుజురాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఘ‌న విజ‌యాలను సాధించిన ఈట‌ల రాజేంద‌ర్ కు ఈ ఉప ఎన్నిక కొత్త అనుభ‌వాన్ని రుచిచూపిస్తోంది. గత ఎన్నిక‌ల్లో గెలిచిన సంద‌ర్భాల్లో టీఆర్ఎస్ జెండాతో ప్ర‌చారం సాగించిన ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌ఫున బ‌రిలో దిగాడు ఈట‌ల‌. గ‌తంలో తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఆకాంక్ష ఒక వైపు, ఈట‌ల రాజేంద‌ర్‌కు ఉన్న ఇమేజ్ మ‌రోవైపు విజ‌యానికి బాట‌లు వేశాయి.


 ప్ర‌స్తుత ఉప ఎన్నిక వాతావార‌ణం మాత్రం అందుకు భిన్నంగా మారింది. గతంలో ఆయ‌న వెంట ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ నాయ‌కులు దూరంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం.. ఆయ‌న అభ్య‌ర్థిత్వం వ‌హిస్తున్న బీజేపీ నాయ‌కుల మ‌ధ్య నెల‌కొన్న విభేదాల కార‌ణంగా సొంత ఇమేజ్‌పైనే విజ‌యం సాధించ‌డ‌మే మార్గంగా కనిపిస్తోంది. గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూడా ఇదే అవ‌గ‌తం అవుతుంది. ప్ర‌స్తుతం హుజురాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్‌కు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉన్న విశ్వాస‌మే విజ‌యానికి దారితీస్తుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌పడుతున్నారు.


 ఈట‌ల ప‌ట్ల ఉన్న సానుభూతి, బీజేపీ అధినాయ‌క‌త్వం పైన ఉన్న న‌మ్మ‌కంతోనే విజ‌యావ‌కాశాలుగా ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నాయి.  ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైన ఈట‌లను ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న టీఆర్ఎస్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అధికార పార్టీ ఒత్తిడితో పాటు సొంత పార్టీలో ఉన్న విభేధాల‌తో ఈట‌ల సొంత ఇమేజ్‌తో ముందుకు వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: