హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు అంతకంతకు హాట్ హాట్ గా మారిపోతున్నాయి. ఇక ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల నగారా మోగగా.. ప్రస్తుతం అందరి దృష్టి కూడా ఈ ఉప ఎన్నిక పైనే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఈ క్రమంలోనే ఇప్పటికే నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఉపసంహరణ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది. ఎన్నికల సంఘం హుజరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించింది. ఇక అన్ని పార్టీలు కూడా ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్నాయి.  హుజురాబాద్ ప్రజలను ఆకర్షించి ఇక తమ గెలుపు ఖాయం చేసుకోవడమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయ్.



 హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మధ్యే అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇక ఇద్దరూ కూడా ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. రాజేందర్ టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు ప్రజలను ఎలా మాటలతో టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుంది అన్న విషయాన్ని కూడా తన ప్రసంగాలలో ప్రస్తావిస్తున్నారు. మరోవైపు టిఆర్ఎస్ అభ్యర్థి  శ్రీనివాస్ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలందరికీ వివరిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.



 ఇలా హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది అని చెప్పాలి. ఇకపోతే బిజెపి అభ్యర్థి ఈటెల రాజేంద్ర పై చర్యలు తీసుకోవాలి అంటూ ఇటీవలే అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం సంచలనం గా మారిపోయింది. టిఆర్ఎస్ అభ్యర్థి  శ్రీనివాస్ పార్టీ నేతలపై బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ టీఆర్ఎస్ పేర్కొంది. టిఆర్ఎస్ పార్టీ ఓటుకు 30 వేల నుంచి 50 వేల రూపాయలు పంచడానికి కూడా   సిద్ధంగా ఉందని ఈటెల రాజేందర్ తన ప్రసంగాలలో ఓటర్లకు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన ఆడియో వీడియో సాక్ష్యాలను కూడా ఎన్నికల సంఘం ముందుకు తెచ్చింది టిఆర్ఎస్.

మరింత సమాచారం తెలుసుకోండి: