పండుగ వచ్చింది అంటే చాలు అందరూ ఎంతో సంతోషంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తమకు అంతా మంచే జరగాలి అని దుర్గా మాతకు ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు అందరూ. ఇలా అందరూ సంతోషంగా ఉన్న సమయంలో దసరా పండక్కి అటు పెట్రోల్ ధరలు మాత్రం అందరికీ ఊహించని షాక్ ఇస్తున్నాయి. కనీసం దసరా పండుగ రోజు కూడా ఊరట ఇవ్వకుండా పెట్రోల్ డీజిల్ ధరలు వాహనదారులు అందరికీ షాక్ ఇచ్చాయి. సామాన్యుడి నడ్డి విరిచే విధంగా ఇటీవలే శుక్రవారం రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇటీవల లీటర్ పెట్రోల్ పై ఏకంగా 35 పైసలు పెరగగా డీజిల్ కూడా 35 రూపాయలు పెరిగింది


 ఇప్పటికే గత కొంత కాలం నుంచి భారీగా పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో వాహనదారులు అందరూ ఎంత బెంబేలెత్తిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ముఖ్యంగా సామాన్య ప్రజలపై అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరలు గుదిబండలాగా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఏదైనా అత్యవసరమైతే తప్ప వాహనాలను అస్సలు బయటకు తీయడం లేదు సామాన్య ప్రజలు.  ఈ విజయదశమికి తమకు మంచి జరగాలని కోరుకుంటున్న వారి కంటే అటు పెట్రోల్ ధరలు తగ్గాలి అని కోరుకుంటున్న సామాన్య ప్రజలే ఎక్కువగా ఉన్నారు అని చెప్పాలి.



 ఇకపోతే ఇటీవల పెరిగిన పెట్రోల్ ధరలు తో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 105.14 రూపాయలుగా ఉంది. లీటర్ డీజిల్ ధర 93.87 రూపాయలుగా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ 111.09 రూపాయలు.. లీటర్ డీజిల్ 101.78 రూపాయలు ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ 102.4 ₹రూ లు.. లీటర్ డీజిల్ 98.26 రూపాయలు ఉంది. ఇక మధ్యప్రదేశ్లో అయితే పెట్రోల్ ధరలు మరింత భగ్గుమంటున్నాయి. లీటర్ పెట్రోల్ ధర 113.73 రూపాయలు లీటర్ డీజిల్ ధర 103.03 రూపాయలు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: