ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్లు ఆయుధాలతో అరాచకాల సృష్టించి అధికారంలోకి వచ్చారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే తాలిబన్ల ప్రభుత్వాన్ని అటు ప్రపంచ దేశాలు మొత్తం వ్యతిరేకిస్తూ ఉంటే ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన పాకిస్తాన్ మద్దతు ప్రకటిస్తూ ఉండటం గమనార్హం. అంతే కాదు ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడిన సంక్షోభం తీర్చేందుకు ప్రపంచ దేశాలతో చర్చలు కూడా జరుపుతుంది పాకిస్థాన్. ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ ప్రభుత్వానికి పాకిస్థాన్ పూర్తిస్థాయి మద్దతు ఇస్తుంది అని చెప్పాలి. కానీ ఇటీవల  పాక్ తీసుకున్న నిర్ణయంతో తాలిబన్లకు ఊహించని షాక్ తగిలింది.


 ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. తాలిబన్ల మితిమీరిన జోక్యం కారణంగా ఇటీవలే ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్కు విమాన సర్వీసులను పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. టికెట్ల ధరలను తగ్గించాలని లేకపోతే సేవలను నిలిపి వేస్తామంటూ తాలిబన్లు ఇటీవలే పాకిస్తాన్ ను హెచ్చరించారు. దీంతో చిర్రెత్తిన పోయిన పాకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇక పూర్తిగా విమాన సర్వీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. కాబూల్ నుంచి ఇస్లామాబాద్కు 2500 డాలర్ల వరకు టికెట్ ధర ఉంటుంది. అయితే ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత కాబూల్కు నిరంతరాయంగా విమాన సర్వీసులను నడుపుతోంది కేవలం పాకిస్తాను మాత్రమే కావడం గమనార్హం.


 ప్రస్తుతం కాబుల్ కు చార్టెడ్ విమానాలను పాకిస్థాన్ ఎయిర్లైన్స్ నడుపుతుంది. అయితే ఇటీవలే విమాన సర్వీసులను నిలిపివేయడంపై పాకిస్తాన్ ఎయిర్లైన్స్ అధికారి అబ్దుల్లా హఫీజ్ ఖాన్ స్పందిస్తూ.. కాబూల్ ఏవియేషన్ అధికారుల వైఖరి కారణంగానే తాము విమానాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక పరిస్థితి అదుపులోకి వచ్చి అనుకూలించే వరకూ ఆ మార్గంలో విమానాలు నడిపేందుకు సిద్ధంగా లేము అంటూ స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో ఆఫ్ఘనిస్తాన్ కు విమానాలు నడుపుతున్నామని చెప్పుకొచ్చారు.  కాబుల్ యుద్ధ ప్రాంతంగా పర్యటిస్తుండగా అందువల్ల బీమా ప్రీమియం ధరలు పెరిగిపోయి టిక్కెట్ల ధరలు కూడా పెరిగిపోతున్నాయి అంటూ ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: