కరోనా వైరస్ ఏ దేశంలో ఎంత అల్లకల్లోల పరిస్థితుల సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ముఖ్యంగా రెండవ దశ కరోనా వైరస్ అయితే ఎవరికి ఊహకందని విధంగా ఎంతో వేగంగా దూసుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయే దుస్థితి ఏర్పడింది. అయితే కరోనా వైరస్ బారినపడి ఎంతోమంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో ఆసుపత్రులకు పరుగులు పెట్టిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలోనే అటు ప్రైవేటు ఆస్పత్రులు కూడా భారీగానే డబ్బులు వసూలు చేశాయి.  అయితే కొంతమంది ఇలా కరోనా వైరస్ బారినపడి  కోలుకున్నప్పటికీ కొంతమంది మాత్రం తీవ్ర అస్వస్థతకు గురై చివరికి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి వచ్చింది. కరోనా వైరస్ ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెట్టింది.



 అయితే ఈ భూమ్మీద నూకల తినే బాకీ లేనప్పుడు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు నిలబడడం కష్టం అని చెబుతూ ఉంటారు పెద్దలు. కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. ముఖ్యంగా కరోనా సమయంలో అయితే ఎంతో మంది ఇదే భావనతో ఉన్నారు.   వైరస్ ఎప్పుడు ఎటు వైపు నుంచి దాడి చేస్తుంది అన్నది ఎవరికీ తెలియదు. మన జాగ్రత్తలో మనం తీసుకుంటాం.. ఈ భూమిమీద బ్రతికే అదృష్టం ఉంటే ప్రాణాలతో ఉంటాం అంటూ ఎంతో మంది ప్రాణాలపై ఆశలు వదులుకున్న ఘటనలు కూడా తెరమీదకు వచ్చాయి. ఇక్కడ జరిగిన ఘటన కూడా ఇలాంటిదే అని చెప్పాలి.



 ఆ దంపతులిద్దరికీ ఒక్కడే కొడుకు.. ఇక కొడుకే ప్రపంచంగా బ్రతుకుతున్నారు. కొడుక్కి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు.  అంతలోనే కరోనా వైరస్ వారి కుటుంబం పై పగ పట్టింది   కొడుకే ప్రపంచంగా బ్రతుకుతున్న ఆ వృద్ద తల్లిదండ్రులకు షాక్ ఇచ్చింది. కొడుకు  వైరస్ బారిన పడ్డాడు  ఈ ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పారెడ్డి గూడెం లో చోటుచేసుకుంది. రైతు సత్యనారాయణ జూలైలో కరోనా వైరస్ బారిన పడ్డారు. తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో ఖమ్మం, హైదరాబాదులో ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల పనితీరు క్షీణించడం తో రోజుకు చికిత్సకు 1.8 లక్షల ఖర్చు అయ్యేది.  ఒక కొడుకు కావడంతో పొలం అమ్మి ఖర్చు చేశారూ తల్లిదండ్రులు.  అయిన అతను బ్రతకలేదు. ఇటీవలె చివరికి ప్రాణాలు వదిలాడు. బిల్లు 1 కోటి 46 లక్షలు కాగా ఆస్పత్రి యాజమాన్యం ముప్పై మూడు లక్షలు తగ్గించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: