పాకిస్తాన్ మరోసారి భారత విలువైన కీలక సమాచారాన్ని పొందటం కోసం హానీ ట్రాప్ ని ఉపయోగించింది. ఇందులో భాగంగా ఇండియన్ ఆర్మీ రహస్య సమాచారాన్ని పొందింది. దీనిగురించి భారత జవాన్ రోహిత్ కుమార్ ను హర్యానా పోలీసులు గురువారం అరెస్ట్ చేసారు, రోహిత్ కుమార్ భోపాల్ లోని  అంబాల జిల్లా  నారాయణ్ ఘర్ ప్రాంతం లో హల్వడర్ అఫ్ విలేజ్ కొదవా గా నియమించబడ్డాడు. ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ఇచ్చిన సమాచారం ప్రకారం రోహిత్ కుమారు అరెస్ట్ చేసినట్లు హర్యానా పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉన్న ఇండియన్ జవాన్లను టార్గెట్ చేస్తూ ఉంటుంది పాకిస్తానీ ఐఎస్ ఐ సంస్థ. రోహిత్ కుమారు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండటం గమనించిన పాకిస్తానీ ఐఎస్ ఐ సంస్థ ఓ ఫిమేల్ హ్యాండ్లర్  ను రంగంలోకి దించింది. రోహిత్ కి  పాకిస్తానీ ఫిమేల్ హ్యాండ్లర్ ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది .



 మరో ఆలోచన లేకుండా రోహిత్ ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్  చేశాడు. కొంతకాలం పరిచయం తరువాత భారత ఆర్మీ సంబందించిన విలువైన , సున్నితమైన సమాచారాన్ని మెల్లి మెల్లిగా రాబట్టడం మొదలు పెట్టింది ఫిమేల్ హ్యాండ్లర్. రోహిత్ కుమార్ ఇండియన్ ఆర్మీ సమాచారాన్ని అంతా ఆమెకు అందించినట్లు ఒప్పుకున్నదాడు. ఈవిషయాన్ని నారాయణగఢ్ DSP  అనిల్ కుమార్ మీడియా సమావేశం లో వివరించారు. ఈ ట్రాప్ లో ఆమె ఓ మహిళ గానే తన ఫోటో ఐడీ పెట్టి పరిచయం చేసుకుంది అయితే అవతలి వ్యక్తి స్త్రీ నా లేక పురుషుడా అని తెలియాల్సిఉంది . వారు ఆర్మీ జవాన్ ల యొక్క మానసిక స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి వారికనుగుణంగా స్నేహం లేదా ప్రేమ వల విసురుతారు . జవాన్లు ట్రాప్ లో పడినప్పుడు వారి మాయమాటలతో విలువైన సమాచారాన్ని పొందుతారు. ఈ ఉదంతం పై సీనియర్ ఆర్మీ అధికారులు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి పాకిస్తాన్ దుశ్చర్యను తప్పుబడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: