గుడివాడ-గన్నవరం....ఒకప్పుడు ఈ రెండు నియోజకవర్గాలు టి‌డి‌పికి కంచుకోటలు....కానీ ఇప్పుడు వైసీపీ అడ్డాలుగా మారిపోయాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో టి‌డి‌పికి మళ్ళీ గెలిచే ఛాన్స్ పెద్దగా రాకపోవచ్చనే చర్చలు మొదలైపోయాయి. మామూలుగా తెలుగుదేశం ఆవిర్భవించిన దగ్గర నుంచి గుడివాడ....ఆ పార్టీకి కంచుకోటగా మారింది....ఎన్టీఆర్ సైతం ఇక్కడ పోటీ చేసి గెలిచారు.

అయితే అలా టి‌డి‌పికి కంచుకోటగా ఉన్న గుడివాడలో కొడాలి నాని ఎంట్రీ ఇచ్చారో...అప్పటినుంచి పరిస్తితి మారిపోయింది. కొడాలి....టి‌డి‌పి తరుపున వరుసగా రెండుసార్లు గెలిచేశారు. కానీ తర్వాత టి‌డి‌పిని వదిలేసి వైసీపీలోకి జంప్ చేసి....2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. అభ్యర్ధులని మార్చినా సరే ఇక్కడ టి‌డి‌పికి గెలుపు దక్కలేదు. ఇక వచ్చే ఎన్నికల్లో గుడివాడలో టి‌డి‌పి గెలవడం కష్టమే అని చర్చలు నడుస్తున్నాయి.

ఎందుకంటే ఇప్పుడు మంత్రిగా ఉన్న కొడాలి నాని....చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అటు టి‌డి‌పి పరిస్తితి మరీ దారుణంగా ఉంది...టి‌డి‌పి తరుపున రావి వెంకటేశ్వరరావు ఉన్నా సరే పెద్దగా ప్రయోజనం లేదు. ఆయన యాక్టివ్‌గా ఉండటం లేదు....దీంతో టి‌డి‌పి కూడా బలోపేతం కావడం లేదు. ఈ పరిస్తితిని చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో గుడివాడలో నాని గెలుపుకు తిరుగులేదని తెలుస్తోంది.

అటు గన్నవరంలో అదే పరిస్తితి....ఈ నియోజకవర్గం కూడా మొదట నుంచి టి‌డి‌పి కంచుకోట. చివరి రెండు ఎన్నికల్లో కూడా టి‌డి‌పినే గెలిచింది. కానీ టి‌డి‌పి నుంచి గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ వైపుకు వెళ్ళడంతో పరిస్తితి మారిపోయింది. వంశీ పార్టీ మారడంతో టి‌డి‌పి బలం తగ్గిపోయింది. పేరుకు ఇంచార్జ్‌గా బచ్చుల అర్జునుడు ఉన్నారు గానీ, ఆయన వల్ల ఉపయోగం లేదు. పార్టీ క్యాడర్ చాలావరకు వంశీ వైపు వెళ్లిపోయింది.

దీంతో గన్నవరంలో టి‌డి‌పి చాలా వీక్ అయింది. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాంటి సందేహం లేకుండా వంశీ....వైసీపీ తరుపున బరిలో దిగి విజయం సాధించడం ఖాయమని తెలుస్తోంది. మొత్తానికైతే గుడివాడ-గన్నవరం నియోజకవర్గాలని టి‌డి‌పి మరిచిపోవాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP