అమ్మ పలుకు జగదాంబ పలుకు లపై వైసీపీ నేతలకు గురి కుదిరిందా? మంత్రి పదవులు ఆశిస్తున్న వారంతా ఉత్తరాంధ్రలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న ఓ పల్లెటూరి కి క్యూ కడుతున్నారా? ఇంతకీ ఆ గ్రామంలో ఏముంది? వైసీపీ నేతలకు ఎందుకంత నమ్మకం ? ఎక్కడో చిత్తూరు జిల్లా నగర ఎమ్మెల్యే  గా ఉన్న రోజా ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా, మక్కువ మండలం, పాపయ్య వలస గ్రామం లో ఒక్కసారిగా తలుక్కుమన్నారు. పార్టీ ప్రచారానికి వచ్చారనుకోవడానికి ఇప్పుడేమి  విజయనగరం జిల్లాలో ఎన్నికలు లేవు. కానీ రోజా వచ్చిన ఉద్దేశం వేరు. పాపయ్య వలసలో దేవుడమ్మ లలిత అనే మహిళ ఆశీస్సుల కోసం వచ్చారామే. ఒక్క రోజానే కాదు వైసీపీలో ముఖ్యలు  అనుకున్న వారికి ఈ ప్రాంతం సుపరిచితమే.

ఇక్కడ దేవుడమ్మ లలిత ఆశీస్సులు తీసుకుంటే రాజకీయంగా ఉన్నత పదవులు పొందవచ్చన్నది వాళ్ళ నమ్మకం. అందుకే రోజా తో పాటు మంత్రి పదవి ఆశిస్తున్న వైసిపి కీలక నాయకులు ఇటీవల పాపయ్య వలసలో వాలిపోతున్నారు. దేవుడమ్మ లలితకు అమ్మవారు ఆవహిస్తారని ఆ సమయంలో ఆమె చెప్పింది నిజమవుతుందని స్థానికులు అనుకుంటు ఉంటారు. 2019 ఎన్నికలకు ముందు వైయస్ విజయమ్మను పార్టీ నేతలు ఇక్కడికి తీసుకు వచ్చారటా. ఎన్నికల్లో వైసీపీకి 150 సీట్లు వస్తాయని దేవుడమ్మ లలిత చెప్పడం ఫలితాలు కూడా అదే విధంగా ఉండడంతో వైసీపీ నేతలకు పాపయ్య వలసపై నమ్మకం కుదిరింది. అప్పటి నుంచి అధికార పార్టీ నేతల రాక పెరిగింది. మంత్రి పదవులు కావలసినవారు,రాజకీయంగా మంచి పొజిషన్ ఆశిస్తున్న వారు ఆ గ్రామానికి వచ్చి  దేవుడమ్మ లలితను ప్రశ్న అడుగుతున్నారటా.

మొదటి విడత లోనే కేబినెట్లో చోటు దక్కుతుందని ఆశించిన రోజా, తమ్మినేని లు చివరి చాన్స్ వస్తుందిలే అని కామ్ గా  ఉంటే లాభం లేదనుకున్నారో ఏమో దేవుడమ్మ లలిత వాక్కు పై నమ్మకం పెట్టుకున్నారు. మరి అమ్మ పలకుల వల్ల ఎంతమందికి క్యాబినెట్ బెర్త్ దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: