కోవిడ్ అలర్ట్ .. నిబంధనలు సడలించిన అమెరికా

కోవిడ్-19 కారణంగా అత్యవసరమైతే తప్ప విదేశీయులను తమ భూ బాగంలోనికి అనుమతించని అమెరికా  తాజాగా నిబంధనలు సడలించింది. అయితే చిన్న మెలిక పెట్టింది. రెండు డోసులకోవిడ్ టీకా తో పాటు, నెగటివ్ సర్టిఫికేట్ వెంట తీసుకురావాలని తెలిపింది.  ఇప్పడిప్పుడే తమ దేశంలోకి రావద్దంటూనే ... తమ దేశ ప్రవేశానికి ఒక ముహూర్తం కూడా ప్రకటించింది. నవంబర్ 8 నుంచి విదేశీయలు తవ దేశంలోకి రావచ్చని తెలిపింది. అమెరికాలోని శ్వేత సౌధం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది.
కోవిడ్-19  అమెరికా దేశం పై పడగ  వేయడంతో  ఆ దేశం ప్రయాణీకుల రాకపోకలై ఆంక్షలు విధించింది.  అయనా అక్కడ కరోనా మహమ్మారి అదుపులోనికి రాలేదు.  కరోనాను అరికట్టేందుకు టీకా వేసుకోవాలని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీనిని కూడా అక్కడి ప్రజలు తేలిగ్గా తీసుకున్నారు. దీంతో  వేలాది మంది కరోనా బారిన పడి మరణిచారు. అసుపత్రులన్నీ  కరోనా బాధితులతో నిండిపోయాయి. నిత్యం వేలాది మంది కరోనా బారిన పడి మరణిస్తుండటంతో ప్రభుత్వానికి కఠిన ఆంక్షలు విధించక తప్పలేదు.
కోవిడ్ -19 తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో  ప్రపంచ దేశాలు ఒక్కోక్కటిగా సడలింపులు ఇస్తున్నాయి. ఈ కోవ లేనే అమెరికా కూడా సడలింపులను ప్రకటించింది.  ఇది విదేశీ ప్రయాణికులకు వరంగా అంతర్జాతీయ పత్రికలు పేర్కోన్నాయి.
దాదాపు 19 నెలల క్రితం అమెరికా తన సరిహద్దులను మూసివేసింది. మెక్సికో,  కెనడా దేశాలతో ఉన్న సరిహద్దులు మూత పడటంతో అమెరికాకు పర్యాటకుల రాకపోకలు స్థంభించాయి. దీంతో పర్యాటక రంగం నుంచి వచ్చే రాబడికి గండి పడింది.అమెరికా ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగ రాబడి కీలక పాత్ర పోషిస్తుంది. లక్షలాది మంది పర్యాటక రంగం పై ఆధార పడి జీవనం సాగిస్తారు. దీంతో కరోనా మహమ్మరి ప్రభావం ఆ దేశ పర్యాటక రంగాన్ని అతలాకుతలంచేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుతున్నదన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో అమెరికా కోవిడ్ -19 నిబంధనలను సడలించింది. అమెరికాలో నివాసం వారిపై  గల ఆంక్షలు సైతం  తాజా నిబంధనలతో తొలగిపోనున్నాయి. వారు స్వదేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే సౌలభ్యం ఈ తాజా నిబంధనల వల్ల కలిగింది. ప్రయాణీకులపై ఆంక్షలు సడలించిన నేపథ్యంలో తమ దేశ పర్యాటక రంగం పుంజుకుంటుందని  శ్వేత సౌధం అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: