2009 నుంచి 2018 వ‌ర‌కు క‌మ‌లాపూర్‌, హుజురాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా ఘ‌న‌విజ‌యాన్ని అందుకున్న ఈట‌ల‌కు హుజురాబాద్ ఉపఎన్నిక కొత్త అనుభ‌వాన్ని రుచి చూపిస్తుంద‌ని నిజం. గ‌తంలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన ఈట‌ల ఈసారి బీజేపీ జెండాతో బ‌రిలోకి దిగాడు. ఇక టీఆర్ఎస్ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతు త‌న‌కు జ‌రిగి అన్యాయాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తున్నారు. ఉద్య‌మ స‌మ‌యంలో త‌న‌కు త‌గిలిన ఎదురు దెబ్బ‌లు.. ఆ తురువాత కేసీఆర్ చేసిన అన్యాయాన్ని వివ‌రిస్తున్న ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు.

   
అవినీతి ఆరోప‌ణ‌ల‌తో మంత్రి ప‌ద‌వినుంచి తొల‌గించింది టీఆర్ఎస్ అధిష్టానం. దీంతో ఎమ్మెల్యే ప‌ద‌వితో పాటు టీఆర్ఎస్‌కు ఈట‌ల రాజీనామా చేయ‌డంతో.. హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్య‌మ‌యింది. రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ఈట‌ల బీజేపీలో చేరారు. ఆత్మ‌గౌర‌మే ప్ర‌ధాన ఆయుధంగా ఎన్నిక‌ల బ‌రిలో దిగిన ఈట‌ల క‌మ‌లం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఎలాగైన మ‌రోసారి హుజురాబాద్ లో గెలిచి స‌త్తా చచాటాల‌నుకుంటున్నారు ఈట‌ల.



    అయితే, బీజేపీ నుంచి బ‌రిలో ఉన్నా పార్టీ కంటే త‌న సొంత ఇమేజ్‌పైనే ఎక్కువ ఆధార‌ప‌డి గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు ఈట‌ల రాజేంద‌ర్. ప్ర‌జ‌ల్లో ఉన్న సానూభూతే త‌న విజ‌యానికి ప్ర‌ధాన అంశంగా ఈట‌ల భావిస్తున్నారు. ఆత్మ‌గౌరం పేరుతో బీజేపీ అభ్యర్థిగా ఈట‌ల బ‌రిలో ఉంటే.. అభివృద్ది మంత్రం ప్ర‌ధాన అస్త్రంగా దూసుకువెళ్తున్న‌ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎలాగైన హుజురాబాద్ గ‌డ్డ‌పై గులాబీ జెండా ఎగుర‌వేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. దీని కోసం ఇప్ప‌టికే ద‌ళిత‌బంధు లాంటి అతి పెద్ద న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది అధికార టీఆర్ఎస్ పార్టీ.


     హుజురాబాద్ బై పోల్ వార్ ప్ర‌ధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య‌నే ఉండ‌నుంద‌ని తెలుస్తోంది. మ‌రి ముఖ్యంగా టీఆర్ఎస్ వ‌ర్సెస్ ఈట‌ల అనే విధంగా హుజురాబాద్ లో రాజ‌కీయ వేడి ర‌గులుతోంది. అధికార బ‌లానికి ఆత్మ‌గౌర‌వానికి జ‌రుగుతున్న ధ‌ర్మ‌యుద్దంలో ఆత్మ‌గౌర‌వం గెలుస్తుంద‌నే ధీమాను ఈట‌ల‌న రాజేంద‌ర్ వ్య‌క్తం చేస్తున్నాడు. మ‌రి సానుభూతి ఈట‌ల‌ను విజ‌య బాట‌లో ప‌యనింప‌జేస్తుందా.? ల‌ఏదా అనేది వేచి చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: