ఏపీలో ప్రభుత్వం పరిస్థితి అటు లోటుబడ్జెట్, ఇటు అప్పులతోనే కాకుండా మరోవైపు విపక్షాల గందరగోళ విమర్శలు, కేంద్ర సహకారం సరిగా లేకపోవడంతో అనుక్షణం నిప్పుల కొలిమి పై కూర్చున్నట్టే ఉంటుంది. తాజాగా రాష్ట్రంలో ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. ఈ సమస్య ముందే ఊహించిన కేంద్రం ఇటీవలే బొగ్గు ను ఇతర దేశాల నుండి దిగుమతి కూడా చేయడం ఆరంభించింది. అయితే అది అవసరాలకు తగ్గట్టుగా లభిస్తుందా లేదా అనేదానిపై స్పష్టత లేనప్పటికీ, ఆయా రాష్ట్రాలలో మాత్రం బొగ్గు అవసరాలు తీవ్రంగా ఉంటున్నాయి. ఆ స్థాయికి కేంద్ర ప్రభుత్వం వాటి అవసరాలను తీర్చలేకపోతుందా లేక రాష్ట్రాలు కూడా కేంద్రం దగ్గర బొగ్గును కొన్నుకోవాల్సి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

ఒకవేళ బొగ్గు కేంద్రం దగ్గర నుండి కొనుగోలు చేసుకోవాల్సి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆ పరిస్థితిలో లేదనే అంశం వాళ్లకు తెలియనిదేమి కాదు, అయినా అందరితోపాటు చెల్లించే బొగ్గు తీసుకోవాలి అంటుంటే, రాష్ట్రము కూడా ఏమి చేయలేని స్థితిలో ఉంది. ఈ స్థితిలో రాష్ట్రము ఇంకొన్నాళ్ళు ఉంటె, విద్యుత్ సంక్షోభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా వస్తే ఖచ్చితంగా ప్రభుత్వంపై ప్రజలలో విరుద్ధ భావాలు పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది అధికార పార్టీకి మంచిది కాదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానిది తప్పా లేక కేంద్రానిది తప్పా అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉండదు, వాళ్లకు సౌకర్యాలు ఉన్నాయా లెవా అనేది మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు.

ఇక రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్రాల నుండైనా బొగ్గు తెస్తున్నట్టు తెలుపుతుంది. వీరి మాటల ప్రకారం కేంద్రం దగ్గర బొగ్గు నిల్వలు తక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది. అంటే దిగుమతి చేసినవి ఏపీ వరకు రాకుండానే అయిపోతుందనేది స్పష్టం అవుతుంది. అందుకే కేంద్రంపై మాత్రమే ఆధారపడకుండా రాష్ట్రం ఇతర మార్గాలలో బొగ్గును సమకూర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనా కేంద్రం కూడా తగిన ఏర్పాటు చేస్తామనే, చేస్తున్నామనో ఆయా రాష్ట్రాలకు స్పష్టంగా చెబితే వారు వేరే మార్గాలు వెతుక్కుంటారు. అయితే కేంద్రం కూడా బాహాటంగానే బొగ్గు నిల్వలు లేవని చెప్పడం లేదు, విద్యుత్ సంక్షోభం వస్తుందని చెప్పడం లేదు. దీనిద్వారా కేంద్రం రాష్ట్రాలకు సరైన స్పష్టత ఇవ్వకపోవడం వలన ఈ స్థితి వచ్చినట్టు అర్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: