ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడివడినప్పుడే లోటు బడ్జెట్ లో ఉన్న విషయం తెలిసిందే. అప్పటి నుండి రాష్ట్రం అయితే అప్పులు చేస్తుంది లేదంటే కేంద్రం ఇచ్చే సాయంతో ముందుకు పోతుంది. ఇటువంటి పరిస్థితులలోనే ప్రభుత్వాలు మారాయి. ఆ మార్పులలో కూడా కొత్త ప్రభుత్వానికి అప్పులే మిగిలాయి తప్ప ఖజానాలో కాసు కూడా లేదు. అలాంటి సందర్భంగా గత అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ, దొరికితే కొత్త అప్పులు చేస్తూ, అప్పుడప్పుడు కేంద్రం ఇచ్చే కాస్తోకూస్తో సాయంతో జగన్ పాలనలో రాష్ట్రం ముందుకు పోతుంది. కానీ కరోనా వచ్చిన తరువాత ఈ స్థితిలో మరింత సమస్యలు వచ్చిపడ్డాయి. అసలే అప్పుల రాష్ట్రం, మూడునెలలు అన్ని ఆదాయ మార్గాలు మూసుకొన్నాయి లాక్ డౌన్ వలన. అంటే రాష్ట్ర పరిస్థితి ఇంకా దిగజారిపోయింది అన్ని స్పష్టం అవుతుంది.

ఇన్ని జరుగుతున్నా అధికారపార్టీ మాత్రం చెప్పిన పధకాలు అన్ని అమలు చేసుకుంటూ హుందాగా పరిపాలన సాగిస్తూనే ఉంది. అయితే గతంలో లాగా కరోనా సమయంలో రాష్ట్రాలకు కేంద్ర అడిగినంత ఆర్థిక సాయం చేయలేకపోయింది అనేది స్పష్టమైన నిజం. అందుకే కాస్త ఆయా రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. ఇలా ఏపీలో కూడా ఒకదానివెంట మరో సమస్య వెంటాడుతూనే ఉండటంతో ఒక స్థాయిలో అప్పు కూడా పుట్టని స్థితికి వచ్చేసింది. ప్రభుత్వం కూడా చేతిలో చిల్లుగవ్వ లేవు అని చేతులు ఎత్తేసింది. కేంద్రం సాయం నిలిపివేసినట్టు బాహాటంగానే ప్రజలలోకి వచ్చి చెప్పుకుంది.

అంటే ఇప్పటి పరిస్థితులలో కనీసం సంక్షేమ పధకాలు కూడా అమలు చేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనే చెప్పాలి. ఇప్పటి పరిస్థితుల్లో అటు కేంద్రం సహా పలు రాష్ట్రాలలో బొగ్గు నిల్వల సమస్య వచ్చి పడింది. కేంద్రం దానికి తగిన ఏర్పాట్లు చేయడానికి కూడా ప్రయత్నం చేసున్నప్పటికీ అవసరానికి తగిన దిగుమతి కూడా లభించడం లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలు తను చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికి ఖజానా ఖాళీగా ఉంది. అయినా ఏదో ఒక ఏర్పాటు చేస్తాము, ఈ సమస్య కూడా ఆక్సిజన్ సమస్య లాగానే త్వర లో  తీరిపోతుంది అని చెప్పుకొస్తుంది. నిజమే కాస్త సమయం కావాలి అంతే, కానీ అది ఎప్పటివరకు అనే విషయం సామాన్యులకు తంటాలు తెచ్చిపెడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: