- మ‌రో ఎనిమిది  వేల కోట్ల వ‌డ్డ‌న
సిద్ధం చేస్తున్న డిస్కంలు

- స‌ర్దుబాటు త‌రువాత
కూడా గాడిన ప‌డ‌ని డిస్కంలు

- ఉత్ప‌త్తికి, పంపిణీకి మ‌ధ్య
గ్యాప్ పెంచుకుంటూ పోవ‌డ‌మే జ‌గ‌న్ ల‌క్ష్యం

గ‌తంలో మాదిరిగా ఇప్పుడు విద్యుత్ రంగం ఉంటుంది అని అనుకునేందుకు వీల్లేదు. ఎందుకంటే జ‌గ‌న్ వ‌చ్చాక పాల‌న‌లో వ‌చ్చిన మార్పులు కార‌ణంగా కొన్ని పీపీపీలు ర‌ద్దు చేశారు. అదేవిధంగా కొన్ని సంస్థ‌ల‌తో వ్య‌క్తిగ‌త లాభాలు ఆశించి కొనుగోలు చేశారు అన్న అనుమానాలూ ఉన్నాయి. ఇవ‌న్నీ ఎలా ఉన్నా ఝార్ఖండ్ లాంటి ప్రాంతాల‌లో కూడా జ‌గ‌న్ కు విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయ‌ని, వాటిని వృద్ధిలోకి తెచ్చేందుకే కొన్ని కొనుగోళ్లు చేపట్టార‌న్న విమ‌ర్శ కూడా ఉంది. ఇదే పంథాలో కొత్త‌గా కొన్ని కొనుగోళ్ల‌కు వెళ్లాల‌ని  యోచిస్తోంది జ‌గ‌న్ స‌ర్కారు. తెలంగాణ‌కు సాయం అడిగే ఆలోచ‌న కూడా చేస్తోంది. ఛ‌త్తీస్ గ‌ఢ్ నుంచి కొంత , ఒడిశా నుంచి కొంత విద్యుత్ తేవాల‌ని అనుకుంటున్నా ఇప్ప‌టికిప్పుడు ఇవేవీ జ‌రిగేవి కావు. కొనుగోలు బ‌కాయిలు తీర్చ‌నిదే కొత్త‌వి సాధ్యం కావు. జ‌గ‌న్ ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేని కార‌ణంగా ఇత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏపీని అంత త్వ‌ర‌గా న‌మ్మ‌వు. ఈ త‌రుణంలో సంక్షోభానికి సిస‌లు కార‌ణం ఎవ్వ‌ర‌న్న‌ది ఇప్పుడు వెతికి తీరాలి. మిగులు విద్యుత్ ఉన్న ఏపీ  కాస్త లోటు భ‌ర్తీ కాక ఇబ్బంది ప‌డుతుందంటే వైసీపీ స‌ర్కారు చేసిన ప‌నులు ఎన్ని సాఫీగా సాగిపోయాయో అర్థం చేసుకోవ‌చ్చు.



స‌ర్దుబాటు ఛార్జీల పేరిట జ‌గ‌న్ స‌ర్కారు ఆ మ‌ధ్య ఎనిమిది వేల కోట్ల‌కు సిద్ధం అయింది. ఉత్ప‌త్తికీ, పంపిణీకీ మ‌ధ్య పెరిగిపోతున్న అంత‌రాన్ని చూసి, దీనిని త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర మ‌ళ్లీ మ‌రో  ప్ర‌తిపాద‌న  ఉంచ‌నుంది. దీనిపై సీఎం ఏమంటారో అన్న‌ది కీల‌కం. వాస్త‌వానికి సెప్టెంబ‌ర్ నుంచి స‌ర్దుబాటు ఛార్జీలు వ‌సూలుకు రంగం సిద్ధం అయింది. విద్యుత్ బిల్లులు కూడా పెరిగాయి. అప్ప‌టి వివ‌రం ప్ర‌కారం తూర్పు ప్రాంతంలో న‌ల‌భై పైస‌లు, మిగ‌తా ప్రాంతాల‌లో రూపాయి 23 పైస‌లు వ‌సూలుకు రంగం సిద్ధం అయింది. అయితే అప్ప‌ట్లో ఛార్జీల మోత‌పై పూర్తిగా వ్య‌తిరేక‌త వ‌చ్చింది. అయిన‌ప్ప‌ట‌కీ ఈ విధానంపై వెన‌క్కు త‌గ్గ‌లేదు జ‌గ‌న్. ఇప్పుడు తాజాగా మ‌రో సారి ఛార్జీల వ‌డ్డ‌నకు అదే స్థాయిలో వ‌డ్డ‌ను సిద్ధం అవుతోంది. దీంతో మ‌రో ఎనిమిది వేల కోట్ల రూపాయ‌ల వ‌డ్డ‌న‌కు ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇవ‌న్నీ ఇప్ప‌టికిప్పుడు తేల‌కున్నా రానున్న కాలంలో వినియోగ‌దారుడి బిల్లుపై వీటి ప్ర‌భావం త‌ప్ప‌క ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: