అఫ్గ‌నిస్తాన్ లో తాలిబ‌న్‌లు అధికారం చేప‌ట్ట‌డాని ప‌రోక్షంగా పాకిస్తాన్ సాయం చేసింద‌నే వాద‌న కూడా ఉంది. దీంతో తాలిబ‌న్‌లో పాకిస్తాన్ మిత్రుల‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో పాకిస్తాన్ తాలిబన్‌ల‌కు షాకిచ్చింది. గురువారం నుంచి కాబూల్‌కు విమాన సేవ‌ల‌ను నిలిపివేసింది పాకిస్తాన్. టికెట్ల రేట్ల‌ను త‌గ్గించాల‌ని ఇటీవ‌ల పీఐఏతో పాటు స్థానిక విమాన‌యాన సంస్థ కామ్ ఎయిర్‌ను హెచ్చ‌రించారు తాలిబ‌న్‌లు. వారి మితిమీరిన జోక్యంతో విమాన స‌ర్వీసుల‌ను నిలిపివేయ‌డం గ‌మనార్హం. ప్ర‌స్తుతం ఇస్లామాబాద్ నుంచి కాబూల్‌కు టికెట్ ధ‌ర 2,500 డాల‌ర్ల వ‌ర‌కు ఉంది. అంత‌కు ముందు కేవ‌లం 120 నుంచి 150 డాలర్ల మ‌ధ్యే ఉండేది.


    అఫ్గనిస్థాన్ ను తాలిబన్ల అక్రమించుకున్న తర్వాత కాబూల్ నుంచి అఫ్గ‌న్‌కు ఒక పీఐఏ విమానయాన‌ సంస్థ మాత్ర‌మే విమాన సర్వీసులు నడుపుతోంది. ప్ర‌స్తుతం పాక్ ఎయిర్ లైన్స్ కాబూల్‌కు ఛార్ట‌ర్డ్ విమాన స‌ర్వీసుల‌ను న‌డుపుతోంది. స‌ర్వీసుల నిలిపివేత‌పై స్పందించిన పీఐఏ అధికార ప్ర‌తినిధి అబ్దుల్లా హ‌ఫీజ్ ఖాన్ కాబూల్...  ఏవియేష‌న్ అధికారుల వైఖ‌రి కార‌ణంగా త‌మ విమానాలు అవాంఛితంగా జాప్యానికి గుర‌వుతున్నాయ‌ని చెప్పారు. ప‌రిస్థితులు అనుకూలంగా మారేవ‌ర‌కు ఆ దిశ‌లో విమానాలను న‌డ‌ప‌బోమ‌ని తేల్చి చెప్పారు ఆయ‌న‌.



 మాన‌వ‌తా దృక్ప‌థంతో అఫ్గ‌నిస్తాన్‌కు విమానాలు న‌డుపుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. బీమా సంస్థలు కాబుల్ ను యుద్ధ ప్రాంతంగా భావిస్తున్నాయ‌ని దీని వ‌ల్ల‌ బీమా ప్రీమియం ధరలు భారీగా పెరిగిపోయాని దీంతో టికెట్ల ధ‌ర‌ల పై ప్ర‌భావం పడుతోంది అని వివ‌రించారు. అలాగే, తాలిబన్లు సైతం చివరి నిమిషంలో ప్రయాణ నిబంధనలు మార్చార‌ని, అనుమతులపై ఆంక్ష‌ల కార‌ణంతో పాటు సిబ్బందిని భయభ్రాంతుల‌కు గురి చేసే విధంగా ప్రవర్తించడం చేస్తున్నారని ఆరోపించారు అబ్దుల్లా హ‌ఫీజ్ ఖాన్‌. ఈ విషయంపై  విమాన‌యా సంస్థ కామ్ ఎయిర్ ఇంకా స్పందించలేదు. భూ మార్గాల్లో దేశం దాటేందుకు ఇబ్బందుల కారణంగా అఫ్గనిస్తాన్‌లో విమాన ప్రయాణానికి  డిమాండ్ పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: