దిగుమ‌తి బొగ్గుపై కార్పొరేట్లు బాగానే శ్ర‌ద్ధ చూపించార‌ని తెలుస్తోంది. దీంతో ప్ర‌భుత్వ రంగం క‌న్నా కార్పొరేట్ రంగ‌మే సాఫీగా ఉంద‌ని, సంబంధిత ప్లాంట్లూ హాయిగానే న‌డుస్తున్నాయ‌ని స‌మాచారం. అదానీల‌తో ఫ్రెండ్షిప్ చేసే మ‌న జ‌గ‌న్ కు ఇవి తెలియ‌వా? టాటాల‌తో స్నేహాస్తం అందించే మోడీకి ఇవి తెల‌య‌వా? తెలుస్తాయి కానీ వారు ప‌ట్టించుకోరు. విద్యుత్ డ్రామాలో ఇద్ద‌రూ ముఖ్య పాత్ర‌ధారులే! ఇప్పుడు వీరిద్ద‌రూ క‌లిసి మ‌న‌ల్ని ముంచుట ఖాయం. పైకి బీజేపీని వైసీపీని తిట్టినా  ప్ర‌భుత్వ రంగ విద్యుత్ సంస్థ‌ల‌ను నిర్వీర్యం చేసి వాటిని ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు అప్ప‌గించాల‌న్న వ్యూహం ఏనాటి నుంచో ఉంద‌న్న‌ది ఓ విమ‌ర్శ. ఈ ప‌రిస్థితుల్లో ఏపీ స‌ర్కారుకు కార్పొరేట్ కంపెనీలే దిక్కు కానున్నాయా?




ప్ర‌భుత్వ విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ‌ల‌ను ఒక్కొక్క‌టిగా మూసి వేయించి, కార్పొరేట్ సంస్థ‌ల‌పై ఆధార‌ప‌డ‌డం అన్న‌ది మ‌న‌కు మాత్ర‌మే చెల్లు. వీటీపీఎస్ కానీ  కృష్ణ‌ప‌ట్నం కానీ ఉత్ప‌త్తికి సంబంధించి కావాల్సినంత బొగ్గును క‌లిగి లేవు. ఈ స‌మ‌యంలో అదాని కంపెనీల‌కు మాత్రం దిగుమ‌తి చేసుకున్న బొగ్గు నిల్వ‌ల‌తో డిమాండ్ కు త‌గ్గ రీతిలోనే విద్యుత్ ను ఉత్ప‌త్తి చేసి అమ్ముకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి. దీంతో జెఎన్ డ‌బ్ల్యూ ఎన‌ర్జీ లిమిటెడ్, టాటా ప‌వ‌ర్ కో, అదానీ సంస్థ‌ల‌కు ఉన్న ముందు జాగ్ర‌త్త మ‌న‌కు లేక‌పోవ‌డ‌మే శోచ‌నీయం.


అవును! విద్యుత్ స‌మ‌స్య‌ల‌పై ఎప్ప‌టి నుంచో కేంద్రం రాష్ట్రాల‌ను హెచ్చ‌రిస్తోంది. ఇదే స‌మ‌యంలో కేంద్రాన్ని జాతీయ మీడియా కూడా హెచ్చ‌రిస్తోంది. అధిక వ‌ర్షాల కార‌ణంగానే బొగ్గు ఉత్ప‌త్తి ఆశించిన రీతిలో లేద‌ని కేంద్రం చెబుతున్నా ఇవ‌న్నీ వినేందుకు బాగుంటాయి కానీ ఆచ‌ర‌ణలో మీరు చేయాల్సిన ప‌నులేవీ చేయ‌డం లేద‌ని మీడియా వ‌ర్గాలు విమ‌ర్శిస్తున్నాయి. విద్యుత్ సంక్షోభంలో మోడీ వాటా కూడా ఉంది. జ‌గ‌న్ వాటా కూడా ఉంది. ఎవ్వరో ఒక్క‌రినే నిందించ‌లేం. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలుకు మార్గం వెతికినా కూడా అది కూడా అంత వేగంగా ఒడ్డెక్కే విష‌యం కాదు. అధిక ధ‌ర‌ల‌కు యూనిట్  ను కొనుగోలు చేశాక, ఛార్జీల వ‌డ్డ‌న మ‌న‌కు అందించ‌కా త‌ప్ప‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp