ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టికే క‌మ్మ వ్య‌తిరేకి అన్న ముద్ర వేయించుకున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచి జ‌గ‌న్ ప్ర‌తిసారి త‌న ప్ర‌సంగంలో క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని ప‌దే ప‌దే టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. ఇక ఎన్నిక‌ల త‌ర్వాత అమ‌రావ‌తి రాజ‌ధానిని మూడు రాజ‌ధానులుగా వికేంద్రీక‌ర‌ణ చేసిన‌ప్పుడు కూడా ఇక్క‌డ క‌మ్మ వాళ్లే ల‌బ్ధి పొందారంటూ.. వారి కోస‌మే రాజ‌ధాని ఏర్పాటు చేశారంటూ ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. ఇక జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక క‌మ్మ నేత‌ల‌ను, వారి వ్యాపారాల‌ను టార్గెట్‌గా చేసుకుని వారిని ఆర్థికంగా దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఆయ‌న‌పై వ‌చ్చాయి.

ఇవ‌న్నీ ఎలా జ‌రిగాయ‌న్న‌ది ప‌క్క‌న పెడితే జ‌గ‌న్ స్వ‌యంగా ఓ క‌మ్మ సీనియ‌ర్ నేత‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని ప‌బ్లిక్ గా హామీ ఇచ్చారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ జిల్లా అధ్య‌క్షుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను కాద‌ని జ‌గ‌న్ బీసీ కోటాలో విడ‌ద‌ల ర‌జ‌నీకి సీటు ఇచ్చారు. ఆమె అప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో ఉండి.. జ‌గ‌న్ సీటు ఇస్తాన‌ని చెప్పిన వెంట‌నే పార్టీ కండువా క‌ప్పుకున్నారు.

ఇక ఆమె కోసం సీటు త్యాగం చేసిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ అన్న‌ను ఎమ్మెల్సీని చేసి, మంత్రి ప‌ద‌వి ఇచ్చి మ‌రీ కేబినెట్లో త‌న ప‌క్క‌న కూర్చోపెట్టుకుంటాన‌ని చెప్పారు. అయితే రెండున్న‌రేళ్లు అవుతున్నా మ‌ర్రికి ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. అటు మ‌ర్రి అనుచ‌రులు కూడా తాము చేసిన త్యాగం, పార్టీ కోసం ప‌డిన క‌ష్టం.. వైఎస్ ఫ్యామిలీకి ఎప్పుడూ వీర విధేయులుగా ఉండ‌డంతో జ‌గ‌న్ మాట త‌ప్ప‌ర‌ని ధీమాగా ఉన్నారు.

మ‌రోవైపు విడ‌ద‌ల ర‌జ‌నీ అప్పుడు రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యే సీటును లాక్కున్నారు. ఇప్పుడు మంత్రి ప‌ద‌వి కూడా త‌మ‌కే రావాల‌ని పావులు క‌దుపుతోంది. ర‌జ‌నీ ఎన్ని అడ్డుపుల్ల‌లు వేసినా కూడా జ‌గ‌న్ రాజ‌శేఖ‌ర్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ప‌ద‌వి ఇస్తే ఆయ‌న ఇచ్చిన మాట నెర‌వేర్చిన‌ట్టు అవుతుంది. లేని ప‌క్షంలో ఆయ‌న‌పై ఇప్ప‌టికే ఉన్న క‌మ్మ వ్య‌తిరేకి ముద్ర మ‌రింత బ‌ల‌ప‌డిన‌ట్ల‌వుతుందన్న చ‌ర్చ‌లు ఆ వ‌ర్గంలో వినిపిస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: